Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబు పై మరోసారి ఫైర్ అయిన అంబటి

- Advertisement -

కొందరిని చూస్తే మొట్ట బుద్ధి అవుతుంది… కొందరిని చూస్తే పెట్ట బుద్ధి అవుతుంది అని పెద్దలు ఊరకే అనలేదు బాబు. నిన్ను చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారు …నిరంతరం ప్రజా సేవలో తరిస్తున్న వైఎస్ కుటుంబాన్ని చూసి ప్రజలు అక్కున చేర్చుకుంటూ, ఆనంద పడుతున్నారు.

దీనిని చూసి తట్టుకోలేక నువ్వు ఏడవడం ఏమైనా బాగుందా బాబు ? ప్రకృతి విపత్తులను మానవ తప్పిదాలు గా నువ్వు చిత్రీకరిస్తూ వికృత ఆనందం పొందడం నీ నీచ స్వభావానికి నిదర్శనం చంద్రబాబు.

ఇటీవల వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటించి … వరద ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలను అభినందించింది.. అద్భుతమైన ప్రభుత్వ యంత్రాంగం ఏపీలో ఉందని .. అందుకే ప్రజలను సకాలంలో ఆదుకోవడం సాధ్యమైందని కేంద్ర బృందం ప్రశంసించిన విషయం నువ్వు తెలుసుకో బాబు అంటు చంద్రబాబు పై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

అయోమయంలో అన్నదాతలు

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం

విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద కుంగిన భూమి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -