Thursday, May 2, 2024
- Advertisement -

విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద కుంగిన భూమి

- Advertisement -

విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద భూమి కోతకు గురైంది. ఆర్కె బీజ్‌ నుండి దుర్గాలమ్మ గుడి వరకు దాదాపు 200 మీటర్ల పొడవునా భూమి కోతకు గురైంది. చిల్‌డ్రన్స్‌ పార్క్‌ సమీపంలో పది అడుగులు కుంగిపోయిన భూమీ.. పార్క్‌లో అడుగు మేర కుంగిపోయింది. దీంతో పార్క్‌లోని బల్లలు విరిపోయాయి. ప్రహారీ గోడ కూలిపోయింది. దీంతో పార్క్ వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసిన అధికారులు.. పార్క్‌వైపు అనుమతిని నిషేధించారు.

గతంలో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సంభవించిన భారీ వరదలకు పలు ఇళ్లు ధ్వంసం కాగా.. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వింత ఘటనలు చోటు చేసుకున్నాయి. మొదట తిరుపతి నగరంలోని శ్రీకృష్ణా నగర్‌లో వాటర్‌ ట్యాంక్‌ పైకి రాగా, అనంతపురం జిల్లాలో ఎండిపోయిన బోరులోంచి జలపాతాం ఎగిసి పడింది.

దీంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా బీచ్‌ వద్ద భూమి కృంగి పోవడంతో సైంటిస్ట్‌లు అయోమయంలో పడ్డారు. రానున్న రోజుల్లో భారీ ముప్పు ఏమైనా రాభోతుందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదు

10 వికేట్ల క్లబ్‌లో న్యూజిలాండ్ బోలర్

తెలంగాణలోకి ఒమైక్రరాన్‌ ప్రవేశించిందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -