అయోమయంలో అన్నదాతలు

- Advertisement -

తెలంగాణ ప్రజలను రాజకీయ నాయకులు అయోమయంలోనికి నెడుతున్నారా? వరి పంటపై కేంద్రం ఏమంటోది ? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది ? ప్రజలు ఎవ్వరి మాట వినాలి ? పంట మార్పిడి మంచిదేనా ? ఇది ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిగ్‌గా మారింది.

వరి ధాన్యం సాగుపై తెలంగాణ రైతాంగం అయోమయంలో పడింది. ఇంతకాలం వరిసాగు చేసిన రైతులు ఇప్పుడు పంట మార్పిడి చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటి పంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేసింది. ఇటీవల వరి గురించి లోక్‌సభ, రాజ్యసభలో చర్చకూడా జరిగింది. రజ్య సభలో జరిగిన చర్చలో తాము వరి కొనుగోలు చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి స్పష్టంగా తెలిపారు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంట వేసుకోవవాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి సూచించారు. వరి కాకుండా పెసర, శనిగ, కందులు వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

- Advertisement -

మరోవైపు వరే తమకు ప్రధాన దిక్కుగా భావిస్తున్న రైతులు ప్రత్యామ్నాయ పంట తమ భూమిలో పండదని అంటున్నారు. ప్రభుత్వం చెప్పిందని తాము ప్రత్యామ్నాయ పంట వేసి నష్టపోవాలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీరు పుష్కలంగా ఉందని రైతులు వరి సాగు చేయాలన్న ప్రభుత్వం ఇప్పుడు వద్దనడంతో రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు.

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం

విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద కుంగిన భూమి

ఢిల్లీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -