వైసీపీ ఆటలు సాగవు అంటున్న చంద్రబాబు

- Advertisement -

వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను బెదిరిస్తూ పాలన సాగిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న గృహహక్కు పథకం పేరుతో వైసీపీ శ్రేణులు రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుందని, ఇదంతా జగన్‌ కావాలనే చేయిస్తున్నారని బాబు మండిపడ్డారు.

ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన జగన్‌.. ఇప్పుడు వాటిని కాల రాశారన్నారు. ఇంటి రుణాన్ని మాఫీ చేస్తామన్న జగన్.. మాట తప్పారని మండి పడ్డారు. గ్రామ సచీవాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అవినీతిమయంగా మార్చారన్నారు. రిజిస్ట్రేషన్ల పనులను సబ్ రిజిస్టర్లు కాకుండా వైసీపీ నాయకులు చేస్తున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఎవ్వరూ పట్టించుకోవడంలేదని వైసీపీ నేతలు వారి సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగుల్ని తమ భానిసలు చేసుకోవాలని చూస్తున్నారన్నారు. వైసీపీ ఆగడాలు ఎక్కువరోజులు సాగవన్న బాబు రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు.

చంద్రబాబు పై మరోసారి ఫైర్ అయిన అంబటి

అయోమయంలో అన్నదాతలు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -