Monday, May 20, 2024
- Advertisement -

వైఎస్సార్సీపీలో ‘ఆనం’ చేరిక ఎప్పుడంటే..?

- Advertisement -

నెల్లూరులో ఆనం బ్రదర్స్‌ రాజకీయం గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.? వివేకా మాస్‌ లీడర్‌ అయితే, రామనారాయణరెడ్డి క్లాస్‌ లీడర్‌గా గుర్తింపు పొందారు. గ‌తంలో వీరిద్ద‌రు కాంగ్రెస్ పార్టీలో ప‌ని చేశారు. మంత్రిగా కూడా ప‌ని చేసిన అనుభవం ఉంది రామనారాయణరెడ్డికి. అయితే గ‌త ఎన్నిక‌ల‌ప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఆనం బ్రదర్స్‌ . ఎన్నిక‌ల తరువాత ఆనం బ్ర‌ద‌ర్స్ అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఆనం బ్ర‌ద‌ర్స్‌కు ఎమ్మేల్సీ ప‌ద‌వి ఎర చూపించి వారిని టీడీపీలో చేర్చుకున్నారు. తెలుగుదేశంలో కొన్నాళ్లు అలాగే కొన‌సాగిన ఆనం బ్ర‌ద‌ర్స్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. ఆశించిన ఎమ్మేల్సీ ప‌ద‌వి రాలేదు. పైగా పార్టీలో చాలా అవ‌మానాలు ఎదుర్కొన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీని వీడాల‌ని ఆనం బ్రదర్స్ డిసైడ్ అయ్యారు. ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల‌నుకున్నారు. ఈలోపే ఆనం వివేకానంద రెడ్డి ఆరోగ్య స‌మ‌స్య‌తో మ‌ర‌ణించ‌డంతో పార్టీ మార్పు కొంత ఆల‌స్యం అయింది. ఆనం రామనారాయణరెడ్డి రాజ‌కీయ‌ల‌లో ఒంట‌రైయ్యారు.

రామనారాయణరెడ్డి పార్టీ కొన‌సాగాల‌ని ఆయ‌న‌ను బుజ్జ‌గించే ప‌నిలో ప‌డ్డారు తెలుగుదేశం నాయ‌కులు. కాని తాను జ‌గ‌న్ పార్టీలో చేరాల‌ని అనుకుంటున్నానని,నా ఆలోచ‌న‌లో ఎటువంటి మార్పు లేద‌ని తేల్చి చెప్ప‌డంతో తెలుగుదేశం నాయ‌కులు ఆనం మీద ఆశ‌లు వ‌దులుకున్నార‌ని తెలుస్తుంది. ఇక ఆనం కూడా సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వైఎస్ఆర్‌సిపిలో చేరాల‌ని అనుకుంటున్న‌ట్లు సమాచారం. ఆనం స్వ‌యంగా జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి పార్టీలో చేరాల‌ని ఆలోచిస్తున్నారు.మ‌రో వారం ,ప‌ది రోజుల‌లో ఆనం వైఎస్ఆర్‌సిపిలో చేర‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.ఆనం లాంటి సీనియ‌ర్ నాయ‌కుడు త‌మ పార్టీలో ఉంటే త‌మకు అండ‌గా ఉంటుంద‌ని వైఎస్ఆర్‌సిపి కూడా భావిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -