Friday, May 17, 2024
- Advertisement -

త్వ‌రలో ఏపీ భాజాపా ఖాలీ అవుతుందా…?

- Advertisement -

ఎన్నిక‌ల వేళ‌ ఏపీలో భాజాపాకు ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రాష్ట్రానికి రావాల్సిన హామీలను అమ‌లు ప‌ర‌చ‌డంలో ఘోరంగా విఫ‌లం అయింద‌న‌డంలో సందేహంలేదు. ఇప్ప‌టికే ప్ర‌జల్లో భాజాపాపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో నేత‌లు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం ఇత‌ర దారులు వెతుక్కుంటున్నారు.

రాష్ట్రం, కేంద్రంలో భాజాపాతో టీడీపీ విడిపోయిన త‌ర్వాత ఆ పార్టీ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. ఓ మోస్త‌రు ప్ర‌జాభిమానం ఉన్న నాయ‌కులు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్ప‌టికే బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన రామ‌కోట‌య్య పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేనుతున్నారు. తాజాగా మ‌రి కొంత మంది నేత‌లు పార్టీలు మారేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఎన్నిక‌ల వేల ప్ర‌జ‌ల్లోకి వెళ్లి రాష్ట్రానికి కేంద్రం ప‌లానా చేసింద‌ని చెప్పుకోలేని ప‌రిస్థితులు నాయ‌కుల‌కు లేవు. ఇలాంటప్పుడు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకోసం పార్టీ మార‌డంలో త‌ప్పేముంది..?

2014 ఎన్నిక‌ల్లో విభ‌జ‌న చ‌ట్ట‌లో ఉన్న హామీలే కాకుండా అద‌నంగా హామీలిచ్చింది. రాష్ట్ర అభివృద్ధికి వీలైనంత స‌హాయం చేస్తామ‌ని మోదీ స్వ‌యంగా హామీలిచ్చారు. ప్ర‌ధానంగా రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా, రైల్వే జోన్, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ లాంటి ముఖ్య‌మైన హామీలున్నాయి. టీడీపీ, భాజాపా అల‌య‌న్స్‌తో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత భాజాపా ఏం చేసిందో అంద‌రికీ తెలిసిందే.

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. సీనియ‌ర్ నేత‌లంద‌రూ ఒక్కొక్క‌రే పార్టీనీ వీడుతున్నారు. భాజాపా ఫ్లోర్ లీడ‌ర్ విష్ణు కుమార్ రాజు కూడా టీడీపీలో చేర‌నున్నారు. మొద‌టి నుంచి బాబుకు అభిమానే. మ‌రో మాజీ మంత్రి కామినేని కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ద‌మ‌య్యారు. పార్టీలో బాబుకు వ్య‌తిరేకంగా ఉన్న నాయ‌కులు జ‌న‌సేన‌, వైసీపీవైపు చూస్తున్నారు.

దేశంలో న‌రేంద్ర మోదీపై ఉన్న భ్ర‌మ‌లు తొల‌గిపోతున్న నేప‌ధ్యంలో ఇక పార్టీలో ఉండి మోదీనీ న‌మ్ముకం స‌న్న‌గిల్లుతోంది. తెలంగాణా ఎన్నిక‌ల్లో భాజాపా ఘోరంగా ఓట‌మి పాల‌వ‌డంతో అది మ‌రింత పెరిగింది. బీజేపీ భావజాలాన్ని బలంగా ఇంకొంద‌రు నేత‌లు సైత టీడీపీతోపాటు వైసీపీ, జనసేనలతో టచ్‌లోకి వస్తుండడం గమనార్హం. ఈ లెక్క‌న చూసుకుంటే త్వ‌ర‌లో భాజాపా ఖాళీ అయిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -