Tuesday, May 21, 2024
- Advertisement -

జగన్ తిరుమల సందర్శన నాడు వినిపించిన విమర్శలు ఇప్పుడు వినిపించవేం?

- Advertisement -

సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజల్లో చాలా మందికి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం సెంటిమెంట్. అందుకే పండగ సెలబ్రేషన్స్ కూడా పక్కనపెట్టి భారీ రద్దీ ఉన్నప్పటికీ తిరుమల దర్శనానికి వెళ్తారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సారి చుక్కలు కనిపించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం, ఆయన బావమరిది బాలకృష్ణ కుటుంబం, బాలకృష్ణ వియ్యంకుల కుటుంబం….ఇంకా చాలా మంది సన్నిహితులందరినీ కలుపుకుని చంద్రబాబు తిరుమల దర్శనానికి బయల్దేరారు. గంటల తరబడి చంద్రాబాబుగారి దర్శన కార్యక్రమం సాగడంతో సామాన్య భక్తులకు నరకం కనిపించింది. ఇక తిరుమల ప్రాంగణంలో జై బాలయ్య, జై టిడిపి నినాదాలు అయితే మార్మోగిపోయాయి. తిరుమల పూజారులు, ఉద్యోగులు అందరూ కూడా బాబుగారి సపరివార సకుటుంబ దర్శనానికి స్పెషల్ ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయారు.

జగన్ తిరుమల దర్శనం సందర్భంగా పచ్చ గ్యాంగ్ చేసిన హంగామా గుర్తుందా? జై జగన్ అని ఎవరైనా నినాదాలు చేస్తే చాలు……. తిరుమల పవిత్రత మొత్తం మంటగలిసిపోయింది అని గగ్గోలు పెడతారు. ఇక జగన్‌ని హిందూ మతస్తులకు దూరం చేయడం కోసం ఏ స్థాయిలో రంకెలేశారో చెప్పనవసరం లేదు. మరి ఇప్పుడు ఆ హిందూ పరిరక్షకులు ఎక్కడ? బూతు ఛానల్ రంకెలు లేవేం? ఓహో……జై బాలయ్య, జై టిడిపి, జై చంద్రబాబు అంటే మాత్రం తిరుమల ఆలయం అంతా పవిత్రమైపోతుందా? జై జగన్ అంటేనే అపవిత్రమైపోతుందా? నిజంగా హిందూ మతవిశ్వాసాలు ఉన్నవాడు, తిరుమల వెంకటేశ్వరస్వామిపై భక్తి ఉన్నవాడెవడైనా ఆ వెంకటేశ్వరస్వామిని, ఆయన ఆలయాన్ని కూడా రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకోవాలని చూస్తాడా? తిరుమలను కూడా రాజీకయ అవసరాల కోసం వాడుకున్న పచ్చ బ్యాచ్ జనాలకు అసలు తిరుమల అపవిత్రమైపోయింది అని మాట్లాడే అర్హత ఉందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -