Monday, May 20, 2024
- Advertisement -

వైసీపీనీ దెబ్బ‌కొట్ట‌డానికి కొత్త అస్త్రం ప్ర‌యోగించ‌నున్న బాబు

- Advertisement -

ఒక వైపు ప్ర‌త్యేక‌హోదా మ‌రో వైపు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. వైసీపీనీ దెబ్బ కొట్టేందుకు బాబు ఇప్పుడు కొత్త ఎత్తులు మొద‌లు పెట్టారు. ఏపీలో మూడు రాజ్య‌స‌భ‌స్థానాలు ఖాలీఅవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ, టీడ‌పీల‌కు ఎమ్మెల్యేల సంఖ్యాబ‌లం ప్ర‌కారం రెండు అధికార‌పార్టీకి, ఒక‌టి ప్ర‌తిప‌క్ష వైసీపీకీ ద‌క్క‌నున్నాయి. వైసీపీకీ ఆ ఒక్క‌సీటు కూడా రాకుండా చేయ‌డానికి బాబు మూడో అభ్య‌ర్తిని నిల‌బెట్టేందుకు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టారు.

ఉన్న ఫ‌లంగా చంద్ర‌బాబు అమ‌రావ‌తిలో మంత్రుల‌తో స‌మావేశ మ‌య్యారు. స‌మావేశంలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో భాజాపాతో ఎలా వ్య‌వ‌హ‌రించాలి, రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే దానిపై స‌మావేశంలో సూదీర్ఘంగా చ‌ర్చించారు బాబు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ మూడో రాజ్య‌స‌భ సీటును వ‌దులుకోవ‌ద్ద‌ని మూడో అభ్య‌ర్తిని నిల‌బెట్టాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ బాధ్య‌త‌ల‌ను సీనియ‌ర్ మంత్రుల‌కు అప్ప‌గించారు.

టీడీపీమూడో అభ్య‌ర్తిని నిల‌బెట్ట‌కుంటే రెండు టీడీపీకీ, ఒక‌టి వైసీపీకి ద‌క్కుతాయి. కాని అదికూడా ద‌క్క‌కుండా చేయ‌డానికి మ‌రోసారి కుళ్లురాజ‌కీయాల‌కు తెర‌లేపారు. మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నిక‌లు జ‌రిగితే భాజాపా ఎమ్మెల్యేలు ఓటు వేస్తారా లేదా అన్న‌ది బాబుకు సందేహంగా ఉంది. మంత్రు ప‌ద‌వుల‌కు మాత్ర‌మే రాజీనామా చేశారు ,కాని త‌మ‌తో క‌ల‌సి ఉన్నార‌ని ఖ‌శ్చితంగా ఓటువేస్తార‌ని కొంద‌రు టీడీపీనేత‌లు అంటున్నారు.

వైసీపీనుంచి ఇప్ప‌టికే 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. ఇక మిగిలింది 44 మంది ఎమ్మెల్యేలు. రాజ్య‌స‌భ‌సీటును గెలుచుకొనేదానికి ఈ బ‌లం స‌రిపోతుంది. కాని ప్ర‌స్తుతం ఉన్న బ‌లంలో ఒక్క ఎమ్మెల్యే త‌గ్గినా వైసీపీకి చేదుఅనుభ‌వం త‌ప్ప‌దు.

మూడో అభ్య‌ర్తిని గెలిపించుకొనేందుకు బాబు మ‌రోసారి ఫిరాయింపుల‌కు తెర‌లేపారు. వైసీపీనుంచి ఏదోవిధంగా ఇద్ద‌రులేదా ముగ్గురు ఎమ్మెల్యేల‌ను లాక్కుంటే జ‌గ‌న్ కు దెబ్బ ప‌డ‌టం ఖాయం. ఈ బాధ్య‌త‌ను ఇప్ప‌టికే కొంద‌రు సీనియ‌ర్ మంత్రులకు అప్ప‌గించారు. ఎందుకంటే భాజాపానుంచి ఉన్న ఇద్ద‌రు మంత్రులు రాజీన‌మాచేశారు కాబట్టి ఆ మంత్రి ప‌ద‌వుల‌ను ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌కు ఎర వేసేందుకు బాబు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇక వైసీపీ కూడా త‌న వ్యూహాల‌తో ముందుకు వెల్తోంది. బాబు ఫిరాయింపుల‌కు తెర‌లేపుతార‌ని వైసీపీ ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్పుడున్న ఎమ్మెల్యేల‌ను కాపాడుకోవ‌డానికి అన్ని ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టికే ఎమ్మెల్యేల‌ను క్యాంపుకు త‌ర‌లించార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఎలాంటి ట్విష్ట్‌లు చోటు చేసుఉంటాయో చూడాలి మ‌రి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -