ఆసక్తి పెంచుతోన్న బీజేపీ ” సినీ వ్యూహం ” ?

BJP Cine Strategy : BJP President JP Nadda Meets Actor Nithiin
BJP Cine Strategy : BJP President JP Nadda Meets Actor Nithiin

బీజేపీ అనగానే ప్రణాళిక బద్దమైన వ్యూహాలకు పెట్టింది పేరు.. తాము అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అధిష్టానం ఎలాంటి వ్యూహాలు పన్నుతుందో ఇటీవల మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే వ్యవహారమే మంచి ఉదాహరణ. ప్రత్యర్థిని ఊహించని రీతిలో దెబ్బకొడుతూ.. బలాన్ని పెంచుకోవడం బీజేపీ కి వెన్నతో పెట్టిన విద్య.. అలాంటి బీజేపీ అధిష్టానం ఫోకస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై పడింది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తూ రాబోయే ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థి పార్టీగా నిలిచింది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని ధృడ సంకల్పంతో ఉంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల దృష్టి అంత కేవలం బీజేపీ పైనే ఉండేలా కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకోసం సినీ తారలను రంగంలోకి దించేందుకు బీజేపీ పెద్దలు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే బీజేపీ పెద్దలు వరుసగా సినీతారాలతో భేటీ అవుతుందడమే ఈ రకమైన వార్తలకు కారణం. ఇటీవల అమిత్ షా జూ. ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.. వీరిద్దరి భేటీ కి సంభంధించిన స్పష్టమైన కారణం తెలియనప్పటికి, రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇక బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే‌సి నడ్డా హాజరు కాగా.. ఆయన యంగ్ హీరో నితిన్ భేటీ అయ్యారు.

అయితే వీరి భేటీకి సంభంధించికి కూడా ఎలాంటి స్పష్టమైన కారణాలు ఇంకా బయటకు రాలేదు. కానీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం నితిన్ న్ను ప్రచారంలో భాగంగా వాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా బీజేపీ పెద్దలు వరుసగా సినీ తారాలతో ఎందుకు సమావేశం అవుతున్నారు ? దీని వెనుక బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటి ? అనే దానిపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారంలో భాగంగా సినీ తారలను రంగంలోకి దించేందుకే ఈ వరుస బేటీలు అని కొందరి అభిప్రాయం. మరి బీజేపీ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో స్పష్టంగా చెప్పలేము కాబట్టి మున్ముందు కూడా మరికొంత మంది సినీతారాలతో బీజేపీ పెద్దలు భేటీ కావడం మాత్రం ఖాయమే అనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.

Also Read

అజాద్ కొత్త పార్టీ.. బీజేపీ తంత్రమే !

కే‌సి‌ఆర్ ప్లాన్ మామూలుగా లేదుగా !

చెప్పులు మోస్తే కనికరించేది ఎవరు ?