Friday, March 29, 2024
- Advertisement -

ఆసియా కప్ : దాయాదుల పోరుకు సర్వం సిద్దం.. అందరి చూపు అతడి పైనే !

- Advertisement -

ఎన్నో రోజులుగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆసియా కప్ లో భాగంగా నేడు చిరకాల ప్రత్యర్థి జట్లు అయిన భారత్ – పాకిస్థాన్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మద్య పోరు అంటే యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ముఖ్యంగా ఇరు దేశాల అభిమానులు అయితే గెలుపోటములను దేశ పరుగు గా భావిస్తూ ఉంటారు. ఇంతవరకు జరిగిన ప్రపంచ కప్పులన్నిటిలో పాక్ పై ఇండియానే పైచేయి సాధిస్తూ వచ్చింది.

అయితే మొదటి సారి గత టి20 వరల్డ్ కప్పులో భారత్ కు షాక్ ఇచ్చింది పాకిస్తాన్. కోహ్లీ కెప్టెన్సీ లో ఉన్న టీమిండియాపై ఏకంగా 10 వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించి భారత్ ను గట్టి దెబ్బ తీసింది. మొట్ట మొదటి సారి ఓటమి రుచి చూసిన ఈ మ్యాచ్ ను టీమిండియా ప్లేయర్స్ గాని, అభిమానులు గాని అంతా తేలికగా మర్చిపోలేరనే చెప్పాలి. దాంతో నేడు జరుగుతున్నా ఆసియా కప్ లో పాకిస్థాన్ పై దేబ్బకు దెబ్బ తీసి ప్రతికరం తీర్చుకోవాలని టీమిండియా ప్లేయర్స్ కసి మీద ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ మ్యాచ్ లో అందరి దృష్టి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పైనే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కోహ్లీ కెప్టెన్సీ లోనే గత టి20 వరల్డ్ కప్ లో భారత్ ఓటమి చవి చూసింది.

ఈ ఓటమి తరువాత విరాట్ కార్నర్ అవుతూ వచ్చాడు. కెప్టెన్సీ దూరం అవ్వడంతో పాటు వరుస వైఫల్యాలను ఎదుర్కొంటూ ఎన్నో విమర్శలకు కేంద్ర బిందువుగా నిలిచాడు. దీంతో ఈ కీలక మ్యాచ్ లో రాణించడం విరాట్ కోహ్లీకి తప్పనిసరిగా మారింది. అంతే కాకుండా ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి వందో టి20 కావడం విశేషం. దాంతో ఫామ్ లో లేని కోహ్లీ ఈ మ్యాచ్ లో ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో కూడా కోహ్లీ విఫలం అయితే రాబోయే టి20 వరల్డ్ కప్పు లో జట్టుకు పూర్తిగా దూరమెయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆశ్చర్యం లేదనే వాదనలు కూడా క్రికెట్ విశ్లేషకుల్లో వినిపిస్తున్నాయి. మరి కోహ్లీ ప్రధర్శన ఎలా ఉండబోతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -