Friday, April 19, 2024
- Advertisement -

ఆజాద్ కొత్త పార్టీ.. వెనుక బీజేపీ హస్తం ఉందా ?

- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కాంగ్రెస్ కు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనే దానిపై సోనియా గాంధీకి లిఖిత పూర్వకంగా అయిదు పేజీల లేఖను సమర్పించారు. ఆ లేఖలో ప్రధానంగా కాంగ్రెస్ నాయకత్వంపై తాను అసహనంగా ఉన్నట్లు అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎక్కువగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తాడని, ఆయన బీజేపీలో చేరబోతున్నాడని గత కొంత కాలంగా తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలను బలపరుస్తూ తాజాగా ఆజాద్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది..

అయితే ఆయన బీజేపీలో చేరతాడా అనే దానిపై కూడా తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీలో చేరడం లేదని, తానే స్వయంగా జమ్ము కాశ్మీర్ లో ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా జమ్ము కాశ్మీర్ చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది. జమ్ము కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నజమ్ము కాశ్మీర్ ను పూర్తిగా తమ అధీనంలో ఉంచుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న జమ్ము కాశ్మీర్ కు రాబోయే రోజుల్లో రాష్ట్ర హోదా కల్పించి అక్కడ ఎన్నికలు నిర్వహించి పగ వేయాలని బీజేపీ చూస్తోంది.

అయితే బీజేపీకి జమ్మూలో కొంత మేర బలం ఉన్నప్పటికి కాశ్మీర్ లో బీజేపీ ప్రభావం పెద్దగా లేదు. అందువల్ల గులాం నబీ ఆజాద్ అక్కడ పార్టీ పెట్టి పరోక్షంగా బీజేపీ కి మద్దతు పలికే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ మద్య అజాద్ రాజ్య సభ పదవి విరమణ సమయంలో మోడీ గులాం నబీ అజాద్ పై ప్రశంశల వర్షం కురిపించారు. అంతే కాకుండా పద్మ భూషణ్ అవార్డ్ తో సత్కరించారు. ఇవన్నీ చూస్తే గులాం నబీ అజాద్ కు బీజేపీ పెద్దలతో మంచి సన్నిహిత్యం ఉందన్న విషయం తేటతెల్లమౌతోంది. అందుకే పక్కా ప్రణాళిక బద్దంగా గులాం నబీ అజాద్ తో కాంగ్రెస్ కు రాజీనామా చేయించి తనతో జమ్ము కాశ్మీర్ లో కొత్త పార్టీ పెట్టించే ప్రతిపాదన అంత కూడా బీజేపీ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read

కే‌సి‌ఆర్ ప్లాన్ మామూలుగా లేదుగా !

జూ. ఎన్టీఆర్ తో బీజేపీ ఏం చేయబోతోంది ?

కుప్పం రగడ.. ఎవరి ప్లాన్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -