Saturday, April 27, 2024
- Advertisement -

కే‌సి‌ఆర్ రైతు సంఘాలతో భేటీ వెనుక ఉన్న అసలు వ్యూహం అదే ?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జాతీయ రైతు సంఘాల నాయకులతో తాజాగా భేటీ అయ్యారు. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, వంటి ఇతరత్రా రాష్ట్రాలను నుంచి వచ్చిన దాదాపు 100 మంది రైతు సంఘాల నేతలు సి‌ఎం కే‌సి‌ఆర్ తో సమావేశం కావడం చర్చనీయాంశం అయింది. దాంతో ఎప్పుడు లేని విధంగా కే‌సి‌ఆర్ రైతు సంఘాలతో ఎందుకు భేటీ అయ్యారు ? అనే దానిపై రాజకీయ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆయా జాతీయ రైతు సంఘాలు మోడీ విధానాలపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్న సంగతి తెలిసిందే. .

మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టలపైనా, పలు విధనాలపైనా నిరసన తెలుపుతూ గత కొన్నాళ్లుగా రైతు సంఘాలు ఆందోళనలు చేపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఆకర్శించేందుకు కే‌సి‌ఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లో ఆరంగేట్రం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల మోడీ విధానాలపై వ్యతిరేకంగా ఉన్న రైతు సంఘాలను ఏకం చేసి జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యేందుకు కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఆయా రైతు సంఘాల నాయకులు కూడా తెలంగాణలో రైతుల పట్ల అమలౌతున్న పథకాలపై ప్రశంశలు కురిపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే జాతీయ రైతు సంఘాలు అన్నీ కూడా కే‌సి‌ఆర్ కు మద్దతు నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక జరిగితే కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల ఆరంగేట్రం మరింత సులభతరం అవుతుంది. అప్పుడు కేంద్రంలో మోడీ పరిపాలనను ఎండగడుతూ దేశ ప్రజల దృష్టిని కే‌సి‌ఆర్ ఆకర్షించే అవకాశం లేకపోలేదు. అందుకే కే‌సి‌ఆర్ రైతు సంఘాల నాయకులతో భేటీని చాలా కీలకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయానికి ఈ రైతు సంఘాలు ఎంతమేర ఉపయోగ పడతాయో చూడాలి.

Also Read

చెప్పులు మోస్తే కనికరించేది ప్రజలా.. పార్టీ పెద్దలా ?

ప్రజలను ఏమార్చే కుట్ర చేస్తోన్న మోడీ !

జగన్ ” ఫ్లెక్సీ బ్యాన్”.. సాధ్యమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -