- Advertisement -
గుజరాత్ ఉపఎన్నికల్లో బిజేపి విజయఢంకా మోగించింది. ఉపఎన్నిక జరిగిన మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. కచ్‌లోని అబ్‌దాస, సురేందర్‌నగర్ పరిధిలోని లింబ్డి, అమ్రేలిలోని ధారి, మోర్బి జిల్లాలోని మోర్బి, బోతడ్ పరిధి గధాబ, వడోదర జిల్లాలోని కర్జాన్, దాంగ్‌జిల్లాలోని దాంగ్, వల్సాడ్‌లోని కప్రాదలో ఉపఎన్నికలు జరిగాయి.
మొత్తం 81 మంది బరిలో నిలిచారు. ఈ స్థానాలన్నింటిలో బిజేపి జయకేతనం ఎగురవేసింది.2017లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు జూన్‌లో రాజ్యసభ ఎన్నికలకు ముందు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఉపఎన్నిక జరిగింది.
ప్రచార ఆర్భాటాలు లేకుండా పోలవరం పనులు
తెలంగాణా లో ఆ పార్టీ అసలు ఉందా లేదా..?