Friday, April 19, 2024
- Advertisement -

జగన్ బీజేపీ పై ఎప్పుడు వత్తిడి తెస్తారో..?

- Advertisement -

జగన్ రాజకీయంలో చాణక్యుడి అంత కాకపోయినా ఎంతో కొంత రాజకీయం అయితే తెలుసు.. ఆమాత్రం తెలియకుంటే ఈ రేంజ్ లోకి ఎలా వస్తాడు మరీ.. అయితే రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎంత దూరమైన వెళ్లే జగన్ బీజేపీ మెడలు వంచి అయినా సరే ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ తెస్తారని ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. బీజేపీ కి వ్యతిరేకంగా వెళ్లి అయినా సరే రాష్ట్రానికి జగన్ మేలు చేకూరుస్తారని అనుకున్నారు కానీ అక్కడ జరుగుతున్నది వేరు.. బీజేపీ తో జగన్ ఏమాత్రము వైరం పెట్టుకోవాలని అనుకోవట్లేదు.. పైగా పార్లమెంట్ లో బీజేపీ ప్రవేశ పెట్టె ఏ బిల్లుకైనా సరే వైసీపీ సపోర్ట్ చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తుంది..

ఇక ఇటీవలే ఢిల్లీ టూర్ లో కూడా జగన్ మోడీ కి సపోర్ట్ గా ఉంటానని మాట ఇచ్చారు.. ఏపీ కి రావాల్సిన దాంట్లో ఏ లోటు లేకుండా చూసుకుంటానని మాట ఇచ్చారట.. అయితే ఇక్కడ ఆసక్తి కార విషయం ఏంటంటే ఏడాదిన్నర దాటుతున్నా రాష్ట్రంలో ఒక్క కేంద్ర మంత్రి కూడా లేరు. ఎంతసేపూ కేంద్రానికి జగన్ విన్నపాలు తప్ప అక్కడ వినిపించుకునేంటంత సీన్ లేదు. ఈ నేపధ్యంలో ఓ విధంగా బంగారం లాంటి అవకాశమే జగన్ ఇంటి తలుపు తట్టిందని అంటున్నారు. అదే రాష్ట్రంలో కేంద్ర మంత్రి అయ్యే అవకాశం.. అయితే అది ఒక్కటి కాదు ముగ్గురికి ఇస్తుందట..

ఇదిలా ఉంటే తమ మనోభావాలను దెబ్బ తీసేలా చేసిన కాంగ్రెస్ ను ప్రజలు ఎక్కడ పెట్టారో అందరు చూశారు..అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసింది.. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంకా బీజేపీ పై కొంత కోపంగానే ఉన్నారు.. జగన్ హోదాను తెస్తాను అంటేనే భారీ మెజారిటీతో గెలిపించడమే కాదు ఎంపీలను పెద్ద ఎత్తున ఇచ్చారు. మరి ఇంతా చేసి జగన్ హోదా ఊసు లేకుండా కేంద్రంతో దోస్తీ కడితే జనం ఊరుకుంటారా. అందుకే జగన్ కి అత్యంత సన్నిహితుడైన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హోదా ఇస్తేనే కేంద్ర ప్రభుత్వంలో చేరేది అని పక్కా క్లారిటీగా చెప్పేశారు. హోదా విషయంలో రెండవ మాట కూడా లేదనేశారు. ఈ నేపథ్యంలో జగన్ ఈ విషయంలో ఏ మేరకు బీజేపీ ని ఒప్పిస్తారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -