Saturday, May 18, 2024
- Advertisement -

టిడిపికి గేలిచే సీన్ లేదు, బాబును నమ్మి మేమే నష్టపోయాం బిజెపి నేత సోము వీర్రాజు

- Advertisement -

బిజెపి-టిడిపి మధ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టే రాజకీయం నడుస్తోంది. ఎవరి స్వార్థం వాళ్ళది. అయితే ఇప్పుడు గుజరాత్ గెలుపు పుణ్యమాని బిజెపి నేతలు బాబుతో సహా టిడిపి నేతలందరినీ ఉతికి ఆరేస్తున్నారు. 2014లో చంద్రబాబు గెలుపు మా భిక్షే అని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఇక బిజెపికి ఆంద్రప్రదేశ్‌లో అంత సీన్ లేదని, ఒంటరిగా పోటీచేస్తే డిపాజిట్లు కూడా రావు అన్నట్టుగా మాట్లాడిన బాబూ రాజేంద్రప్రసాద్‌ని అయితే ఓ స్థాయిలో విమర్శిస్తున్నారు బిజెపి నేతలు. పనిలో పనిగా చంద్రబాబు రాజకీయ వ్యూహాలను కూడా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.

కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టిడిపిని స్థాపిస్తే బాబు మాత్రం ఎంచక్కా కాంగ్రెస్‌తో లోపాయికారి రాజకీయం చేసిన విషయాన్ని తాజాగా బిజెపి నేత సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శించాడు. కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కు రాజకీయాలు నడిపాడని, కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నట్టుగా వ్యవహరించిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించాడు. అలాగే 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి బాబు మునగడంతో పాటు వాజ్‌పేయి నేతృత్వంలోని బిజెపిని కూడా నిండా ముంచాడని సోము వీర్రాజు విరుచుకుపడ్డాడు. 2004 తర్వాత కూడా మళ్ళీ జన్మలో బిజెపితో కలవనని, బిజెపితో పొత్తు చారిత్రక తప్పిదమని అన్న బాబు…..మోడీ మేనియా చూసి బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి తానే ముందుకొచ్చాడన్నాడు. 2014లో టిడిపి విజయం కేవలం బిజెపి మద్ధతువళ్ళనే అని చెప్పుకొచ్చాడు సోమూ వీర్రాజు. ఇక కాకినాడ ఉపఎన్నికల్లో కూడా బిజెపి మద్ధతు లేకపోతే టిడిపి దారుణంగా ఓడిపోయి ఉండేదని చెప్పాడు.

మొత్తంగా చూస్తే ఇంతకుముందూ ఎన్నడూ లేని స్థాయిలో చంద్రబాబు, టిడిపి, బాబు రాజకీయాలపై ఒక ప్రతిపక్ష నేత స్థాయిలో విరుచుకుపడ్డాడు సోమూ వీర్రాజు. మరి ఇప్పుడు బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి. ఎలా స్పందించడం ఏముంది? ఆవేశంగా స్పందించే గుణమున్న టిడిపి నేతలకు కూడా మాట్లాడొద్దు ……సైలెంట్‌గా ఉండండి అని చెప్తాడు అని రాజకీయ విశ్లేషకులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మహా అయితే బాబు ఆగ్రహం, బిజెపితో తెగదెంపులే అంటున్న బాబు అని చెప్పి ఓ రెండు మూడు వార్తలు మాత్రం రాయించుకోగలడు. అంతకుమించి మోడీకి వ్యతిరేకంగా బాబు ఏమైనా చేయగలడా? ఓటకు నోటు తర్వాత నుంచీ ఒక్క మోడీకే కాదు, కెసీఆర్‌కి కూడా ఎప్పుడో సాగిలపడ్డాడు బాబు. ఆ విషయం తెలుసు కాబట్టే బాబుతో పోల్చుకుంటే చాలా చిన్న స్థాయి నాయకుడైన సోము వీర్రాజు కూడా బాబుపై విరుచుకుపడిపోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -