Friday, March 29, 2024
- Advertisement -

జూ. ఎన్టీఆర్ అస్త్రంగా బీజేపీ వ్యూహాలు ?

- Advertisement -

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో జూ. ఎన్టీఆర్ ఇటీవల భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి భేటీతో తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. అసలు జూ. ఎన్టీఆర్ అమిత్ షా తో ఎందుకు భేటీ అయ్యారు ? ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నాడా ? టీడీపీని కాదని ఎన్టీఆర్ బీజేపీతో చేతులు కలపబోతున్నాడా ? అసలు ఎన్టీఆర్ తో బీజేపీ ఏం చేయబోతోంది ? అసలు వీరిద్దరి భేటీ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి ? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే జూ. ఎన్టీఆర్ అమిత్ షా భేటీ ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని, వారిద్దరి మద్య కేవలం సినిమాల గురించిన చర్చ మాత్రమే జరిగిందని బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. .

ఇటీవల అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నా ” ఆర్ ఆర్ ఆర్ ” మూవీను అభినందించేందుకే అమిత్ షా జూ. ఎన్టీఆర్ తో భేటీ అయినట్లు కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేవలం మూవీ అభినందన విషయమైతే.. రాజమౌళి, రామ్ చరణ్ కూడా భేటీ అవ్వాల్సి ఉంది.. కానీ అలా కాకుండా ఎన్టీఆర్ ఒక్కడే భేటీ కావడంతో చర్చ మొదలైంది. బీజేపీ అధిష్టానం ఏదైనా ప్రణాళిక బద్దంగానే వ్యూహాలు రచిస్తుందని అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే జూ. ఎన్టీఆర్ ను ఒక అస్త్రంగా బీజేపీ వాడుకోబోతుందని కొందరి అభిప్రాయం.ముఖ్యంగా ఏపీలో బీజేపీ ప్రభావం ఆవగింజంత కూడా లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ బలం పెంచుకోవాలన్న.. ఆ పార్టీకి మంచి వాక్చాతుర్యం, ప్రజల్లో ఫాలోయింగ్ కలిగిన నేత చాలా అవసరం.

అందుకే ఎన్టీఆర్ పై బీజేపీ ఫోకస్ చేసినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరో వాదన ఏమిటంటే.. ఇటీవల మహారాష్ట్రలో సక్సస్ అయిన ఏక్ నాథ్ షిండే ప్రయోగం ఏపీలోని తెలుగుదేశం పార్టీపై ప్రయోగించేందుకు జూ. ఎన్టీఆర్ ను బీజేపీ రంగంలోకి దించుతోందనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీని ఎన్టీఆర్ టెక్ ఓవర్ చేయాలని ఎప్పటినుంచో ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ను ఏక్ నాథ్ షిండేలా మార్చి టీడీపీని బీజేపీ వశం చేసుకునే అవకాశం కూడా ఉందని కొందరి విశ్లేషకుల అంచనా. ఏది ఏమైనప్పటికి అమిత్ షా జూ. ఎన్టీఆర్ భేటీ ఏపీ రాజకీయాల్లో హిట్ ను పెంచింది అనేది వాస్తవం.

Also Read

ప్రజలను ఏమార్చే కుట్ర చేస్తోన్న మోడీ !

కుప్పం రగడ.. ఎవరి ప్లాన్ ?

జగన్ ” ఫ్లెక్సీ బ్యాన్”.. సాధ్యమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -