Friday, April 26, 2024
- Advertisement -

ప్రజలను ఏమార్చే కుట్ర చేస్తోన్న మోడీ !

- Advertisement -

ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ సోదాలు బిజెపేతర పార్టీ నేతపై గట్టిగానే ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నుంచి కొందరు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కొందరు, తృణముల్ కాంగ్రెస్ నుంచి కొందరు ఈడీ కేసులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈడీ సోదాలు ఎదుర్కొంటున్న పార్టీలు అన్నీ కూడా కేంద్రంలో బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేవే కావడం గమనార్హం. అయితే కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలపైనే అవినీతి ఆరోపణలు ఎందుకొస్తున్నాయి ? బీజేపీ లో అవినీతికి పాల్పడుతున్న వారు లేరా ? ఒకవేళ ఉంటే వారికెందుకు ఈడీ కేసులు వర్తించడం లేదు ? అనే ప్రశ్నలు కచ్చితంగా ఎదురవుతాయి.

ఈ విషయాన్ని అలా ఉంచితే దేశలో పెరిగిన నిత్యవసర ధరల గురించి, పెరిగిన జిఎస్టి గురించి, మండిపోతున్న పెట్రో ధరల గురించి, పతనమౌతున్న రూపాయి గురించి ఎక్కడ చర్చ లేదు. కానీ ప్రతిపక్ష నేతల అవినీతి నేరారోపణల గురించి మాత్రం ఎడతెరిపిలేని చర్చ జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే మోడీ సర్కార్ ప్రణాళిక బద్దంగానే ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తోందా ? అంటే అవుననే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి కే‌టి‌ఆర్ ఇటీవల ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ” ఇది మోడీ ప్రభుత్వం కాదు.. ఏడి ప్రభుత్వం( అటెంక్షన్ డైవర్షన్ ), దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మార్చే కుట్ర జరుగుతోందని, ఈ కుట్రాలను కనిపెట్టకపోతే, దేశానికి, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం జరుగుతుందని ” కే‌టి‌ఆర్ ట్విట్టర్ లో ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఒక విధంగా చూస్తే కే‌టి‌ఆర్ చేసిన వ్యాఖ్యలలో వాస్తవం కూడా లేకపోలేదు. ఎందుకంటే.. ఇటీవల పార్లమెంట్ సమావేశాలలో కూడా జిఎస్టీ గురించి, పెరిగిన ధరల ధరల గురించి, ఎలాంటి చర్చ ప్రస్తావనకు రాలేదు.. మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు ఎత్తిచూపే ఛాన్స్ ప్రతిపక్షలకు ఇవ్వకుండా పార్లమెంట్ సమావేశాలను ముగించరానే ఆరోపణలు కూడా మోడీ సర్కార్ పై గట్టిగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో కే‌టి‌ఆర్ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -