Monday, April 29, 2024
- Advertisement -

చంద్రబాబు స్టైల్ మార్చింది ఆయనే!

- Advertisement -

రాజకీయాల్లో చంద్రబాబుకు చతురత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 40 ఏళ్ల సుధీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన వేసిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ప్రత్యర్థులను చిత్తు చేసే ఎత్తులు.. ఇలా ప్రతి అంశము కూడా చంద్రబాబు కు అపార చాణక్యుడిగా పేరును కట్టబెట్టాయి. మరి రాజకీయాల్లో ఇంతటి అనుభవం ఘడించిన బాబుకు గత ఎన్నికలు మాత్రం కోలుకోలేని దెబ్బ తీశాయి. అసలు టీడీపీ చరిత్రలోనే అత్యంత ఘోర ఓటమిని గత ఎన్నికలు రుచి చూపించాయి. అయితే గత ఎన్నికల్లో బాబు ఓడిపోవడానికి కారణాలెన్ని ఉన్నప్పటికి.. ఈసారి వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా గెలుపొందాలనే లక్ష్యంతో ఉన్నారు చంద్రబాబు. అందుకోసం తన స్టైల్ మార్చి తన మునుపటి పంథాకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. .

గతంలో ఏవైనా బహిరంగ సభలలో బాబు ఎంతో ప్రశాంతంగా సుధీర్ఘ ప్రసంగాలు చేస్తూ అభివృద్ది గురించి అధికంగా ప్రస్తావించేవారు.. అంతే కాకుండా ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు కూడా చాలా తక్కువ చేసేవారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు ఎంతో అగ్రెసివ్ ప్రసంగాలు చేస్తూ.. విమర్శలే లక్ష్యంగా తన మాట వ్యవహారశైలిలో మార్పు కనబరుస్తున్నారు. అయితే చంద్రబాబులో ఈ మార్పు రావడానికి కారణం ప్రస్తుతం టీడీపీ వ్యూహకర్త వ్యవహరిస్తున్న రాబిన్ శర్మనే అనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు కూడా వ్యూహకర్తను నియమించని బాబు.. ఈసారి గెలుపుకోసం వ్యూహకర్తను నియమించుకున్నారు. అయితే రాబిన్ శర్మను అధికారిక వ్యూహకర్తగా టీడీపీ ప్రకటించకపోయినప్పటికి.. ప్రస్తుతం చంద్రబాబులో కనిపిస్తున్న మార్పు ఆయన వల్లనే అనే చర్చ జరుగుతోంది.

రాబిన్ శర్మ ఇచ్చిన సలహాల మేరకే.. టీడీపీ వ్యూహ రచనలో మార్పు వచ్చిందట. ప్రస్తుతం టీడీపీ జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతికతను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు.. ” బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రనికి.. హూ కిల్డ్ బాబాయ్.. ” వంటి నినాదాలు రాబిన్ వ్యూహ రచనలో భాగమేనని తెలుస్తోంది. ముఖ్యంగా ” బాదుడే బాబుడు..ఇదేం కర్మ మన రాష్ట్రనికి.. ” ఈ నినాదాలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకొనిపోయి టీడీపీకి మంచి మైలేజ్ తీసుకొని వచ్చాయి. అంతే కాకుండా బాబు అగ్రెసివ్ స్పీచ్ లు కూడా ప్రజల్లో మంచి అటెంక్షన్ తీసుకొస్తున్నాయి. దాంతో వచ్చే ఎన్నికల వరకు బాబు ఇదే అగ్రెసివ్ ను కంటిన్యూ చేసే అవకాశం ఊంది. మొత్తానికి రాబిన్ శర్మ వ్యూహాల పుణ్యమా అని టీడీపీలో మంచి జోష్ కనిపిస్తోంది. మరి ఎన్నికల ముందు రాబిన్ టీడీపీకి ఇంకెలాంటి వ్యూహాలు ప్రతిపాదిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

“బటన్ నొక్కుడు “.. ఇదేం పాలనరయ్యా !

రాజకీయాల్లో పవన్ జోకరా.. కింగ్ మేకరా?

కే‌సి‌ఆర్ రహస్య వ్యూహం.. అదే అంటున్న బీజేపీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -