Monday, May 20, 2024
- Advertisement -

ఓటుకు కోట్లుః బాబు ఇంకా ఎంత భయపడాలో? ఎన్ని త్యాగం చెయ్యాలో?

- Advertisement -

ఈ విషయంలో మాత్రం చంద్రబాబుపై ప్రత్యర్థులు కూడా జాలి చూపిస్తారేమో. ఎన్ని అబద్ధపు హామీలిస్తేనేం…….మోడీ ఇమేజ్‌ని వాడేసుకుంటేనేం…..పవన్‌లాంటి నటనాయకుడితో విన్యాసాలు చేయిస్తేనేం….. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు అన్న అపప్రథ మూటకట్టుకుంటేనేం…..మొత్తానికి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. అయితే ఒకే ఒక్క నిర్ణయం….. ఆ ఆనందం మొత్తాన్ని హరించి వేసింది. మూడు నాలుగేళ్ళుగా ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. మోడీ, కెసీఆర్‌లు నరకం చూపిస్తున్నా స్నేహం నటించాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారీగా నష్టపోయారన్న విషయం పక్కనపెడితే చక్రం తిప్పానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబునే పూర్తిగా సైలెంట్ చేసేసింది ఓటుకు కోట్లు కేసు.

హైదరాబాద్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కును కాలరాస్తూ విజయవాడకు వెళ్ళిపోవడం….. తెలంగాణాలో టిడిపిని పూర్తిగా వదులుకోవడం….మోడీ ఏమీ చేయకపోయినప్పటికీ మోడీని సమర్థిస్తూ రాజకీయం చేయడం….. మోడీపై వ్యతిరేకతను కూడా తానే పూసుకోవాల్సి రావడం…..బాబు కష్టాలు అన్నీ ఇన్నీకాదు. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయం కూడా ఓటుకు కోట్లు కేసే నిర్ణయించిందని తాజా వార్తలు వినిపిస్తున్నాయి. ఓటుకు కేట్లు కేసులో వాదనలు, వాయిదాల వ్యవహారాలన్నీ చూసుకుంది కనకమేడల రవీందర్ కుమారే. ఇక ఓటుకు కోట్లు కొనుగోలు వ్యవహారంలో పంచిన డబ్బులు సిఎం రమేష్‌ని అన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. స్వయాన సిఎం రమేష్ కూడా చాలా పెద్ద వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చివరి నిమిషంలో కనకమేడల రవీందర్ పేరు విన్పించడానికి ఢిల్లీ నుంచి ఒక ప్రధాన ఫోన్ కాల్ కారణమన్నది జాతీయస్థాయి జర్నలిస్టుల ఖబర్. ఆ కాల్ వచ్చాకే బాబు నిర్ణయం మారిపోయిందట. ఇక సిఎం రమేష్ మాత్రం రాజ్యసభ సీటు ఇవ్వకపోతే నా వ్యూహాలు నేను చూసుకుంటా అనే స్థాయిలో చంద్రబాబును హెచ్చరించాడన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మూడో అభ్యర్థిగా నిలబెడతానని బాబు చెప్పినప్పటికీ సిఎం రమేష్ అందుకు కూడా ఒఫ్పుకోలేదట. ఆ రకంగా రెండు రాజ్యసభ సీట్లకూ అభ్యర్థుల ఎంపికకు ఓటుకు నోట్లు కేసుకు ఉన్న బంధం గురించి ఇప్పుడు మీడియాలో చాలానే వార్తలు వినిపిస్తున్నాయి. ఓటుకు కోట్లు పుణ్యమాని బాబు ఇంకా ఎన్ని త్యాగాలు చెయ్యాలో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -