Friday, May 17, 2024
- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబుకు ఓటుకు నోటు బిగ్ షాక్‌

- Advertisement -

ఓటుకు నోటు కేసు విష‌యంలో చంద్ర‌బాబుకు బిగ్ షాక్ త‌గిలింది. ఇన్నాల్లు కేసు విచార‌ణ ముందుకు జ‌ర‌గ‌కుండా స్త‌బ్ధ‌త‌గా ఉన్న కేసు సుప్రీం నిర్ణ‌యంతో క‌ద‌ల‌నుంది. ఇన్నాల్లు కేసును ముందుకు పోకుండా చంద్ర‌బాబు సంస్థ‌ల‌ను మ్యానేజ్ చేస్తూ వ‌చ్చారు. కాని సుప్రీం నిర్ణ‌యంతో బాబు ప‌రిస్థితి కుడితిలో ప‌డిన ఎలుక‌లాగా త‌యార‌య్యింది.

టీడీపీ అధికార దాహానికి ప్రతీకగా నిలిచిన ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ చేపట్టింది.

శుక్రవారం ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణా రెడ్డి పిటిషన్‌ వేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ, ఆళ్ల రామకృష్ణారెడ్డి తరుపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తమ వాదనలు వినిపించారు. కేసు విచారణను తెలంగాణ ఏసీబీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని, అప్పుడే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు విన్నవించారు.

అయితే త్వరలో ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉండటంతో.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండా ఉండాలని న్యాయవాది సిద్దార్థ కోర్టుకు అప్పీల్ చేశారు. అయితే న్యాయస్థానం మాత్రం ఆయన వాదనతో ఏకీభవించలేదు. తదుపరి విచారణ ఫిబ్రవరిలో ఉంటుందని జస్టిస్ బి లోకూర్ ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం తీర్పును ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. ఎన్నిక‌ల హ‌డావుడి కూడా అప్పుడే ఉండ‌టంతో ఇది బాబుకు బిగ్ షాక్ అనే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -