Saturday, May 18, 2024
- Advertisement -

టీడీపీ నియేజ‌క వ‌ర్గాల్లో మొద‌లైన టికెట్ల చిచ్చు…

- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళుండగానే చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పి మొద‌ల‌య్యింది. ఒవైపు వైసీపీకే స‌ర్వేలు అనుకూలంగా ఉండ‌టం ..మ‌రొ వైపు పార్టీలోనె కొత్త లొల్లి మొద‌ల‌య్యింది. టిడిపి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో విబేధాలు ప్రారంభ‌మ‌య్యాయి.సిట్టింగ్ ఎంఎల్ఏలను కాదని ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులు పోటీకి రెడీ అయిపోతున్నారు.వైసీపీలోని ప్రత్యర్ధులతో పోటీ పడటం ఒక సమస్యతే పార్టీలో తయారైన శతృవులతో పోరాడటం మరొక సమస్యగా తయారైంది. ఇపుడీ విషయంపైనే పార్టీలో పెద్ద చర్చ మొదలైంది

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఫిరాయింపు ఎంఎల్ఏ ఎస్ వి మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, మొన్నటి వరకూ ఈయనకు ఎటువంటి సమస్య లేదుకానీ తాజాగా రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ కొడుకు టిజి భరత్ నుండి సమస్యలు మొదలయ్యాయి. మొన్ననే కర్నూలులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీకి తాను పోటీచేస్తానని ప్రకటించి సంచలనం రేపారు.కర్నూలు నియోజకర్గంలోని ఇరువర్గాల మధ్య చిచ్చు మొదలైంది.

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ వరదాపురం సూర్య నారాయణరెడ్డికి కూడా ఇదే విధమైన సెగ తగులుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేయటానికి పరిటాల శ్రీరామ్ రంగం సిద్దం చేసుకుంటున్నారు. పరిటాల శ్రీరామ్ అంటే పరిటా రవి, మంత్రి సునీత కొడుకన్న విషయం అందరికీ తెలిసిందే. నియోజకవర్గం మొత్తం కాబోయే ఎంఎల్ఏ అంటూ శ్రీరమ్ ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేస్తున్నారు. దాంతో నిత్యం సిట్టింగ్ ఎంల్ఏ, శ్రీరామ్ వర్గాల మధ్య ఘర్షణలే.

ఇటువంటి సమస్యే కదిరి నియోజకవర్గంలో కూడా కనబడుతోంది. ఇక్కడ కూడా వైసీపీ నుండి గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన అత్తార్ చాంద్ భాష కు పార్టీ నేతలే చిచ్చుపెడుతున్నారు. అత్తార్ కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చేందుకు లేదని టిడిపి సీనియర్ నేతలు చంద్రబాబుకు చెబుతున్నారు.మొత్తం మీద సుమారు 20 సిట్టింగ్ ఎంఎల్ఏ నియోజకవర్గాల్లో ప్రత్యర్ధుల నుండి చిచ్చు మొదలైనట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయ్.మ‌రి బాబు ఎలా స‌ర్దుబాటు చేస్తారొ చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -