Friday, May 3, 2024
- Advertisement -

జనసేనలోకి చిరు ఎంట్రీ.. పవన్ ఒప్పుకుంటాడా ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ జీవితనికి గుడ్ బై చెప్పి చాలా రోజులే అవుతోంది. మొదట ప్రజారాజ్యం పార్టీ పెట్టి క్రియాశీలకంగా రాజకీయాల్లో తిరుగులేని వెలుగు వెలిగిన చిరు ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి విధితమే. ఇక కాంగ్రెస్ లో కొన్ని రోజులు కేంద్ర మంత్రిగా కూడా కొనసాగారు.అయితే ఆంద్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడదీయడంతో ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయింది. దీంతో ఏపీ కాంగ్రెస్ నేతలలో చాలా మంది ఇతర పార్టీల గూటికి చేరడం, మరికొంత మంది తమ వ్యక్తిగత పనులవైపు మొగ్గు చూపడం వంటివి చేశారు. ఇక చిరు కూడా ” ఖైదీ నెమబర్ 150 ” తో మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. .

ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్.. రాజకీయాల ప్రస్తావననే పూర్తిగా మరిచిపోయారు. అయితే తన తమ్ముడు పవన్ కల్యాణ్ ” జనసేన ” పార్టీ స్థాపించి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీపై మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు నోరు మెదపలేదు. ఇక పవన్ కూడా చిరు మద్దతు ఎప్పుడు కోరలేదు. అయితే ఇటీవల తన కొత్త సినిమా గాడ్ ఫాదర్ మూవీ ప్రమేషన్స్ లో భాగంగా చిరు చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ” జనసేనకు మద్దతిస్తున్నట్లు ఎప్పుడు చెప్పలేదని, తను రాజకీయాలకు దూరంగా ఉండడం పవన్ కు హెల్ప్ కావొచ్చు ” అని చిరు చెప్పుకొచ్చారు. అంతే కాకుండా పవన్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలని, పవన్ నిజాయితీ, నిబద్దత తనకు తెలుసని చిరు వ్యాఖ్యానించారు. అంతే కాకుండా భవిష్యత్తులో పవన్ కు మద్దతిచ్చే అవకాశం ఉందని కూడా చిరు చెప్పడం గమనార్హం.

దీంతో వచ్చే ఎన్నికల్లో చిరు జనసేన తరుపున బరిలోకి దిగబోతున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఒకవేళ చిరు జనసేనలోకి ఎంట్రీ ఇస్తే పవన్ కచ్చితంగా స్వాగతించే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పవన్ క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తన అన్న చిరంజీవి రాజకీయాల్లో రాణించి ప్రజలకు సేవ చేయాలని పవన్ అప్పట్లో బలంగా కోరుకున్నారు. కానీ చిరంజీవి ఊహించని రీతిలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పవన్ వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంచితే చిరు వ్యక్తిత్వం గురించి ఆయన సేవ దృక్పథం గురించి పవన్ గొప్పగా చెప్పుకొచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందువల్ల చిరు రాకను పవన్ కచ్చితంగా స్వాగతించే అవకాశం ఉంది. మరి చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా ? లేదా అనేది చూడాలి.

Also Read

పులివెందుల సీటు ఎవరికి ?

జాతీయ పార్టీకి ముందు కే‌సి‌ఆర్ ప్లాన్ ఇదే ?

మోడీ ” యాక్టర్ “.. రాహుల్ “మాస్ లీడర్ ” !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -