Thursday, May 2, 2024
- Advertisement -

టి‌ఆర్‌ఎస్ (TRS) చాప్టర్ క్లోజ్.. ఇక కే‌సి‌ఆర్ కు గడ్డుకాలమే !

- Advertisement -

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రెల్ 27 న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ( కే‌సి‌ఆర్ ).. తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీని స్థాపించారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు, శాసనసభ సభాపతి పదవికి, శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వి. ప్రకాష్ వంటి కొందరి నాయకులతో కే‌సి‌ఆర్ తెలంగాణ విప్లవ జ్వాలను రగిలించేందుకు తెరాస పార్టీకి బీజం వేశారు. ఇక అప్పటినుంచి తెలంగాణ గుండె చప్పుడుగా టి‌ఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఇక తెలంగాణ సాధనలో టి‌ఆర్‌ఎస్ పార్టీ తరుపున ప్రజలు చేసిన పోరాటం.. కే‌సి‌ఆర్ నాయకత్వం ప్రజల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్రా వేశాయి.

దాంతో టి‌ఆర్‌ఎస్ పేరు దేశమంత కూడా మారుమోగింది. మరి అలాంటి టి‌ఆర్‌ఎస్ ( TRS ) పేరు ఇకపై కనిపించదు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీ చేసే క్రమంలో ఆ పార్టీ పేరును ” భారత రాష్ట్ర సమితి ” గా మార్చారు కే‌సి‌ఆర్. దసరా రోజున తెలంగాణ భవన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో టి‌ఆర్‌ఎస్ ( TRS ) పేరు మార్పుపై ప్రకటన చేశారు. ఈ తీర్మానానికి 283 మంది సభ్యులు మద్దతు ప్రకటించడంతో టి‌ఆర్‌ఎస్ ( TRS ).. బి‌ఆర్‌ఎస్ ( BRS ) గా మారడం అనివార్యం అయింది. ఇక గత కొంత కాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కే‌సి‌ఆర్.. జాతీయ పార్టీ ప్రకటనపై కొన్ని రోజులుగా దోబూచులాడుతూ వచ్చారు.

అయితే టి‌ఆర్‌ఎస్ ను తెలంగాణ వరకే పరిమితం చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కే‌సి‌ఆర్ మరో కొత్త పార్టీ పెడతాడని వార్తలు వచ్చాయి. కానీ చివరకు టి‌ఆర్‌ఎస్ ( TRS ) పార్టీనే పేరు మార్చి బి‌ఆర్‌ఎస్ ( BRS ) గా.. జాతీయ పార్టీగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే టి‌ఆర్‌ఎస్ పేరు మార్పు కే‌సి‌ఆర్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో టి‌ఆర్‌ఎస్ కు సుస్థిర స్థానం ఉంది.. ఆ పేరును తెలంగాణ ప్రజలు అంతా తేలికగా మర్చిపోలేరు. ఇప్పుడు కే‌సి‌ఆర్ ఆ పార్టీ పేరు మార్చడంలో కేవలం తన రాజకీయ ప్రయోజనం కోసమే తప్పా వేరొకటి లేదని.. ప్రజలు అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పేరు మార్పు అంశం కే‌సి‌ఆర్ పై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం.

Also Read

జనసేనలోకి చిరు ఎంట్రీ.. పవన్ ఒప్పుకుంటాడా ?

పులివెందుల సీటు సునీతకే.. మరి జగన్ పరిస్థితి ?

గాడ్ ఫాదర్ డబుల్ డోస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -