Thursday, May 9, 2024
- Advertisement -

వాట్సప్ : మీరు ఆన్లైన్ లో ఉంటే.. ఈ సెట్టింగ్ చేసుకోండీ !

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు వాట్సప్ ను యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన రోజు వారి దినచర్యలో వాట్సప్ చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరికైనా మెసేజ్ పంపాలన్న.. లేక పోటోస్ వీడియోస్ వంటివి పంపించాలన్న వాట్సప్ నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ విధంగా వాట్సప్ అనేది మన డైలీ దినచర్యలో ఒక భాగమైంది. దీంతో యూజర్ల సౌకర్యార్థం వాట్సప్ మాతృ సంస్థ అయిన మెటా సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను వాట్సప్ లో తీసుకొస్తూ ఉంటుంది. ఆ విధంగా వాట్సప్ తీసుకొచ్చిన ఒక కొత్త ఫీచర్ గురించి తెలుసుకుందాం !

సాధారణంగా మనం వాట్సప్ ఆన్ చేసినప్పుడు అవతలి వారికి మనం ఆన్లైన్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. అలా కనిపించడం వల్ల మనం వాట్సప్ లో ఎంత సమయం ఉన్నాం అనే సంగతి ఇతరులకు ఈజీగా తెలిసిపోతుంది. అయితే వాట్సప్ తీసుకొచ్చిన ఈ కొత్త సెట్టింగ్ వల్ల మనం ఆన్లైన్ లో ఉన్న సంగతి అవతలి వాళ్ళకు తెలియకుండా హైడ్ చేసుకోవచ్చు.


*అందుకోసం ముందుగా వాట్సప్ ఆన్ చేయాలి.

*ఆ తరువాత పైన ఉన్న త్రీ డాట్స్ ను క్లిక్ చేయాలి.
​*ఆ తరువాత సెట్టింగ్ ఓపెన్ చేయాలి ​

*ఆ తరువాత అకౌంట్స్ ఓపెన్ చేసి ప్రైవసీ పై క్లిక్ చేయాలి
*అక్కడ లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
*అక్కడ లాస్ట్ సీన్ మనం కావాలంటే ఎవరు చూడకుండా nobody పై ఉంచుకోవచ్చు. ఇక ఆన్లైన్ లో ఉన్నట్లు కూడా కనిపించకూడదు అంటే ఆన్లైన్ ఆప్షన్ దగ్గర “same as last seen” పై ఒకే చేస్తే సరిపోతుంది.

Also Read

రాత్రి నిద్రించే ముందు ఈ ఆహారంతో ఆరోగ్యానికి మేలు !

ఈ జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ రాదట!

యూట్యూబ్ లో వెంటనే ఈ సెట్టింగ్స్ చేసుకోండి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -