Saturday, April 27, 2024
- Advertisement -

గాడ్ ఫాదర్ : అంతా బాగుంది కానీ.. ఏదో తక్కువైంది ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ” గాడ్ ఫాదర్ “. మోహన్ రాజ దర్శకత్వం వహించిన ఈ మూవీ దసరా కానుకగా నేడు ( అక్టోబర్ 5 ) గ్రాండ్ గా రిలీజ్ అయింది. రిలీజ్ కు ముందు విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినీ అభిమానుల్లో గాడ్ ఫాదర్ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఎట్టకేలకు అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ నేడు సినిమా రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయిన అన్నీ చోట్ల పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ నటించిన ” లూసిఫర్ ” మూవీకి రీమేక్ అయినప్పటికి తెలుగులో మెగాస్టార్ చిరుకి తగినట్లుగా దర్శకుడు మోహన్ రాజా మార్పులు చేశారు. పక్కా పోలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీలో చిరు స్టైల్, స్క్రీన్ ప్రజెంటేషన్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. .

మూవీ కథలో కొత్తదనం లేకపోయినప్పటికి చిరు ను కొత్తగా చూపించడంలో దర్శకుడు సక్సస్ అయ్యాడు. ఇక ఇతర నటీనటుల విషయానికొస్తే సత్యదేవ్ పాత్ర సినిమాకు అదనపు హైలెట్ గా నిలుస్తుంది. ఇక నయనతార కూడా తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి. ఇక గెస్ట్ పాత్రలో సల్మాన్ ఖాన్ పాత్ర కు పెద్దగా ప్రదాన్యత లేదనే చెప్పాలి. ఇక సాంకేతిక నిపుణుల విషయానికొస్తే.. థమన్ అందించిన సాంగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేనప్పటికి.. బ్యాక్ గ్రాండ్ స్కోర్ మాత్రం సినిమాకు ప్రాణంగా నిలిచిందనే చెప్పాలి. మొత్తంగా మూవీలో కొత్తదనం లేకపోయినప్పటికి మెగా అభిమానులను అలరించే అన్నిరకాల కమర్షియల్ అంశాలు మూవీలో ఉండడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఆచార్య తో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్.. ఈ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడనే చెప్పాలి.

Also Read

దసరా రోజున ఈ పనులు అసలు చేయకండి !

వీరి జోడీ.. భలే బాగు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -