Monday, May 20, 2024
- Advertisement -

పవన్ అండ లేకపోతే టిడిపి గెలిచే ఛాన్సే లేదుః బాబు ఇంటెలిజెన్స్

- Advertisement -

చంద్రబాబు తీరు ఎప్పుడూ అంతే. బయటికి చెప్పే విషయాలకు లోపల విషయాలకూ అసలు సంబంధమే ఉండదు. చంద్రబాబుతో నాలుగేళ్ళపాటు సన్నిహితంగా మెలిగిన పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని బలంగా చెప్పాడంటేనే బాబు అబద్ధాల స్థాయి అర్థం చేసుకోవచ్చు. ఇక టిడిపి నాయకులు కూడా అంతర్గతంగా బాబు అబద్ధాల సామర్థ్యం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. టిడిపిలో ఉన్న సీనియర్ మోస్ట్ నాయకులు కూడా బాబుని పూర్తిగా నమ్మలేని పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ఇక పవన్ ఏం నమ్ముతాడు? అందుకే బయటికి వచ్చేశాడు. అయితే చంద్రబాబు మాత్రం మొదట్లో పవన్ పై విరుచుకుపడ్డాడు.

అయితే ఇప్పుడు మాత్రం పూర్తిగా టోన్ మార్చేశాడు చంద్రబాబు. పవన్ అండ లేకపోతే టిడిపికి ఘోర పరాభావం తప్పదని ఇంటెలిజెన్స్ వర్గాలు బాబుకు తేల్చిచెప్పాయి. అందుకే ఇప్పుడు ఇలాంటి కష్టకాలంలో నన్ను వదిలివెళ్ళిపోతావా అనే స్థాయిలో పవన్‌ని బహిరంగంగానే దువ్వుతున్నాడు చంద్రబాబు. ఇక తెరవెనుక కూడా పవన్‌తో టిడిపి కాపు నేతల రాయబారాలు షురూ అయ్యాయని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితు అయిన ఒక మంత్రి, రాజధాని వ్యవహరాలు చూసుకుంటున్న మరో మంత్రివర్యుడు కలిసి ఎలా అయినా పవన్‌ని ఒప్పించాలని చూస్తున్నారు. ఇంతకుముందు పవన్ 25 ఎమ్మెల్యే సీట్లు, 5ఎంపి సీట్లు అడిగితే నో అన్న చంద్రబాబు ఈ సారి మాత్రం పవన్‌తో కాంప్రమైజ్ అవ్వడానికే మొగ్గు చూపుతున్నాడు. సీట్ల పంపకాల విషయంలో తేడా వచ్చే బాబుతో విభేదించిన పవన్….చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర విమర్శలు చేశాడు. మరి ఇప్పుడు అడిగినన్ని సీట్లు ఇస్తానంటే మళ్ళీ చంద్రబాబుతో కలుస్తాడా? చంద్రబాబు-పవన్‌లు కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఇద్దరినీ మరోసారి నమ్ముతారా? రాష్ట్రం కోసం కలిశారని అనుకుంటారా? లేక అధికారం కోసం రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని అనుకుంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -