Thursday, May 16, 2024
- Advertisement -

బాబు కు మరో షాక్.. వైకాపాలోకి దగ్గుబాటి ఫ్యామిలీ

- Advertisement -

2019లో అధికారం సొంతం చేసుకునేందుకు.. జగన్ అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చారు. అలానే ఏపీలో టీడీపీకి ప‌ట్టున్న కీల‌క‌మైన జిల్లాలపై ప్ర‌యారిటీ ఇస్తున్నాడు. అయితే జగన్ ఇప్పుడు చంద్ర‌బాబు బంధువుల పై దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తె.. మాజీ మంత్రి పురందేశ్వ‌రి, ఆమె భ‌ర్త ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావులతో చంద్ర‌బాబుకు విబేధాలు ఉన్నాయి.

పురందేశ్వ‌రి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత బీజేపీలో ఉన్న ఆమె చంద్ర‌బాబుపై పలు సందర్భాలలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉంటే ద‌గ్గుపాటి దంప‌తుల‌ను వైసీపీలోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌ని కేవిపి, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ తెర‌వెన‌క తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర‌రావు రాజమండ్రి వచ్చి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన తనయడు ద‌గ్గుపాటి చెంచురామ్ పోలిటిక‌ల్ ఎంట్రీ కోసం ద‌గ్గుపాటి దంప‌తులు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలో తమ కుమారుడికి టిక్కెట్ వ‌స్తుంద‌న్న నమ్మకం లేకపోవడంతో వాళ్లు స‌రైన ఆల్ట్ర‌నేటివ్ కోసం ట్రై చేస్తున్నారు.

బీజేపీతో పొత్తు ఉన్నా చంద్ర‌బాబు ప‌ర్చూరు సీటు త‌మ‌కు ఇస్తార‌న్న గ్యారెంటీ లేదు. ఈ నెపథ్యంలో జ‌గన్ నుంచి ద‌గ్గుపాటి ఫ్యామిలీకి రెండు ఆఫ‌ర్లు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. పురందేశ్వ‌రికి కోస్తాలో కోరుకున్న ఎంపీ సీటుతో పాటు చెంచురామ్‌కు ప‌ర్చూరు వైసీపీ సీటు ఇస్తామ‌న్న ప్ర‌తిపాద‌న‌ను కెవిపి, ఉండ‌వ‌ల్లి వాళ్ల ముందు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. మరి వైసీపీలోకి ద‌గ్గుపాటి దంప‌తులు చేరితే.. ఏపీ రాజ‌కీయాల్లో సంచలనమే. కాకపోతే పురంధరేశ్వరి బిజెపిని అంత తేలిగ్గా వీడరనే వారు కూడా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -