Tuesday, April 30, 2024
- Advertisement -

ఈ ఎన్నికలు లోకేశ్ కోసమైనా గెలవాల్సిందే.. బాబు ప్లాన్ !

- Advertisement -

టీడీపీకి వచ్చే ఎన్నికలు జీవన్మరణ పోరాటమనే చెప్పాలి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఏ మాత్రం తేడా కొట్టిన టీడీపీ నాయకత్వంపై ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు వయసు పైబడడంతో భవిష్యత్ టీడీపీ నాయకుడు ఎవరనేది ఇప్పటికీ కూడా అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. ప్రస్తుతం టీడీపీ జాతీయ కార్యదర్శిగా లోకేశ్ భాద్యతలు నిర్వర్తిస్తున్నప్పటికి భవిష్యత్ లో టీడీపీ నాయకుడిగా లోకేశ్ సత్తా చాటగలరా ? అంటే ఆ పార్టీ శ్రేణులే చెప్పలేని పరిస్థితి. అందుకే భవిష్యత్ లో టీడీపీ అంతర్మధనానికి చోటివ్వకూడదంటే ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.

ఒకవేళ ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే చంద్రబాబు అధికారిక సి‌ఎం గా బాద్యతలు నిర్వహిస్తూ అనధికార సి‌ఎంగా లోకేశ్ ను ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లోకేశ్ ను ఒక బలమైన నేతగా ప్రజలు గుర్తించాలంటే.. లోకేశ్ సామర్థ్యంపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రస్తుతం లోకేశ్ ప్రజల్లో ఉంటూ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రావడం లేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధిస్తే.. లోకేశ్ ను సంపూర్ణ నాయకుడిగా తీర్చిదిద్ది తను రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారట.

అయితే లోకేశ్ తన మార్క్ పాలిటిక్స్ ను ఎంతవరకు చూపిస్తారనేది ఆసక్తికరం. ఇక ప్రస్తుతం లోకేశ్ లో గతంతో పోలిస్తే చాలానే మార్పు కనిపిస్తోంది. బాడీ లాంగ్వేజ్, మాట విధానంలో స్పష్టమైన మార్పు కనబరుస్తూ ప్రత్యర్థి పార్టీపై విమర్శలు గట్టిగానే గుప్పిస్తున్నారు. అలాగే తరచూ కార్యకర్తలతో బేటీ కావడం వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ భవిష్యత్ టీడీపీ చీఫ్ గా ఎదిగేందుకు అన్నీ విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరి లోకేశ్ ఎంత యాక్టివ్ గా ఉన్నప్పటికి కేవలం చంద్రబాబు తనయుడిగానే గుర్తిస్తున్నారు తప్పా.. తన సొంత మార్క్ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే.. నిత్యం లోకేశ్ నామజపం చేసేటట్లుగా బాబు వ్యూహాలు రచించి.. తనయుడిని సంపూర్ణ నాయకుడిగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. మరి 2024 ఎన్నికలు టీడీపీకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

వర్నర్లు వర్సస్ ముఖ్యమంత్రులు.. అసలేంది ఈ రచ్చ ?

మోడీ రాకతో జగన్ బేజారు.. పవన్ హుషారు !

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -