Friday, May 17, 2024
- Advertisement -

మోడీ రాకతో జగన్ బేజారు.. పవన్ హుషారు !

- Advertisement -

ఈ నెల 11 న ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రధాని రాకతో ఏపీ రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే ప్రధాని రాకకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. అయితే ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లను ఈసారి ప్రధానమంత్రి కార్యలయమే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నానా హంగామా చేస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే బీజేపీ కన్నా ఏపీ ప్రభుత్వమే ప్రధాని రాక పట్ల అమితమైన ఆసక్తి కనబరుస్తోంది.

ఇక ప్రధాని ఏపీ రాకతో ప్రస్తుతం అందరిలోనూ ఒకటే చర్చ జరుగుతోంది. అదేమిటంటే ప్రధాని దృష్టి పవన్ వైపు ఉంటుందా ? లేదా జగన్ వైపు ఉంటుందా ? అనేది. ఎందుకంటే ప్రస్తుతం జనసేన, బీజేపీ లు మిత్రపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సారి ప్రధాని పర్యటన కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక గతంలో ప్రధాని అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు పవన్ కు ఆహ్వానం అందినప్పటికి హాజరు కాలేదు. కానీ అప్పుడు వైఎస్ జగన్ చిరంజీవిని ఆహ్వానించి మోడీకి స్వాగతం పలికించారు. అయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కావడంతో పవన్ హాజరైయ్యేందుకు ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది.

కానీ ఇప్పుడు పరిస్థితి వేరు ప్రధాని విశాఖలో పర్యటించి పలు కీలక ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కేంద్రప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పథకాలను ప్రారంభించనున్నారు. దాంతో ఈ సారి ప్రధాని పర్యటనలో పవన్ కూడా పాల్గొనే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక గతకొంత కాలంగా పవన్ బీజేపీకి మిత్రపక్షంగా ఉంటున్నప్పటికి.. కార్యకలాపాల్లో బీజేపీతో కలిసి నడవడం లేదు. ఒకవేళ పవన్ ను దూరం చేసుకుంటే బీజేపీకి చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది.

ఎందుకంటే పవన్ అండతోనే బీజేపీ ఏపీలో రానిస్తోందనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకే పవన్ తో తమ స్నేహం బలంగానే ఉందని చాటిచెప్పేందుకు ప్రదాని రాక కోసం పవన్ కు కచ్చితంగా ఆహ్వానం పంపే అవకాశం ఉంది. ఒకవేళ పవన్ వాస్తే జగన్ కు షాక్ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన, వైసీపీ మద్య గత కొన్ని రోజులుగా రాజకీయ వేడి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానితో పవన్ కలిసినడవడం జగన్ కు మింగుడు పడని విషయం. మరి విశాఖ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చూపు జగన్ పై ఉంటుందా ? లేదా పవన్ పై ఉంటుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఇవి కూడా చదవండి

ముందస్తు ఎన్నికలు వస్తే లాభం ఎవరికి ?

మూవీ పాలిటిక్స్.. ఇదే గురూ మన ట్రెండు !

ఏపీలో బైపోల్ వార్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -