Tuesday, April 23, 2024
- Advertisement -

ఎన్ని కుప్పిగంతులు వేసిన జగన్ ముందు పనిచేయవు..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఏరులై పారుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ని జగన్ ఇప్పటికే వెలికి తీసే ప్రయత్నంలో జగన్ ఉన్నారు.. ఆ క్రమంలోనే కొంతమంది ఎలుకల్ని జైలుకి పంపాడు.. వారు కూడా అవినీతి ఆరోపణల్లో నిజం నిర్ధారణ అవడంతో సైలెంట్ గా ఉండక తప్పట్లేదు.. ప్రతిపక్ష పార్టీ లో అవినీతికి పాల్పడ్డ వారిపై జులుం విప్పుతూ వారిని జైలుకి పంపిస్తూ ప్రజలకు అవినీతి లేని సామ్రాజ్యాన్ని సృష్టించే పనిలో ఉన్న జగన్  తన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.. రోజు రోజు కి గ్రాఫ్ పెంచుకుంటున్నారు.. అయితే దీనిపై చంద్రబాబు దుబారా ఖర్చు చేస్తున్నారు ఆరోపణలు చేయడం ఒకింత విమర్శకు దారి తీస్తుంది.

మ‌న్మోహ‌న్ సింగ్ వంటి ఆర్థిక నిపుణులు సైతం ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ అనుస‌రిస్తున్న విధానాలే సరైన‌వ‌ని పేర్కొంటున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు అండ్ కో మాత్రం ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్ల‌డ‌మే ప‌నిగా ఆరోప‌ణ‌లు చేయడం చంద్రబాబు కుళ్ళు తనానికి నిదర్శనంగా మారుతుంది. ఇక జగన్ పై ఎంత అసూయా ఉందో  మరోసారి చంద్రబాబు రుజువు చేశారు. ఆంద్రప్రదేశ్ లో తిరుపతి  పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలు ఊపు మొదలైంది.. అన్ని పార్టీ లు అక్కడ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీజేపీ పార్టీ లు అక్కడ పాగా వేయాలని చూస్తుండగా టీడీపీ మాత్రం అక్కడ పోటీ చేయకూడదని అనుకుంది.. అయితే జగన్ ని అక్కడ ఓడించడానికి చంద్రబాబు పన్నాగం పన్నాడట..

తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఉప ఎన్నిక సమయానికి బీజేపీతో సయోధ్య కుదిరితే సరే లేకుంటే బయట నుంచైనా ఆ పార్టీకి మద్దతివ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. తాము పోటీ చేసి అనవసరంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ఎందుకని సీనియర్ నేతల వద్ద కూడా చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలిసింది. వైసీపీని ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి అయినా ఓడించగలిగితే జగన్ పై విజయం సాధించినట్లేనని చంద్రబాబు భావిస్తున్నారు. రాజధాని అమరావతి అంశాన్ని తిరుపతి ఉప ఎన్నికలో రిఫరెండంగా ప్రకటించేందుకు మాత్రం చంద్రబాబు ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

అక్కడ టీడీపీ బరిలోకి దిగుతుందా..?

ప్రత్యర్థులను కలిపాడు సరే.. కాపురం మాటేంటి..?

చంద్రబాబుకు మొండివైఖరి ఎంటి..?

స్థానిక బలాన్ని నమ్ముకుంటున్న జగన్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -