Saturday, May 4, 2024
- Advertisement -

ప్రత్యర్థులను కలిపాడు సరే.. కాపురం మాటేంటి..?

- Advertisement -

రాజకీయాల్లో నేతలకు విరోధాలు, విరోధులు తక్కువేం లేరు.. ఏ నియోజక వర్గంలో అయినా ఎమ్మెల్యే కు ప్రత్యర్థులు ఉంటారు.. సొంత పార్టీ నుంచి ఉంటే మాత్రం అది పెద్ద తలనొప్పి ని చెప్పాలి.. అలా వల్లభనేని వంశీ , యార్లగడ్డ వెంకట్రావ్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం కొనసాగేది.. వీరు ఒకప్పుడు అపోజిట్ పార్టీ లో ఉన్నప్పుడు పోటీ హోరా హోరీ గా ఉండేది కానీ టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తిరుగుబాటు లేవదీశారు. తర్వాత పార్టీకి దూరమైపోయి వైసీపీకి దగ్గరయ్యారు.

అయితే ఇక్కడే యార్లగడ్డ కు జగన్ వైఖరి నచ్చలేదు.. నియోజక వర్గంలో వైసీపీ తరపున తాను బలంగా ఉన్నానని తెలిసి కూడ వంశీ ని ఎలా పార్టీ కి చేరువ అవనిస్తారు అన్నది ఆయన ఆవేదన.. అయితే వీరిద్దరి మధ్య ఇటీవలే ఓ ఆసక్తికర పరిణామం ఎదురైంది.. వంశీ ని చేరదీయడం తో . యార్లగడ్డకు జిల్లా సెంట్రల్ బ్యాంకు ఛైర్మన్ పదవి ఇచ్చారు. దాంతో యార్లగడ్డ సైలెంట్ అయిపోవటంతో వంశీయే వైసిపి ఎంఎల్ఏగా చెలామణి అయ్యారు. కానీ  ఊహించని రీతిలో మరో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు యాక్టివ్ అయ్యారు. దాంతో మళ్ళీ వంశీ-దుట్టా వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంతలో ఏమయ్యిందో ఏమో మళ్ళీ యార్లగడ్డ కూడా వంశీకి వ్యతిరేకంగా రాజకీయాలు మొదలుపెట్టేశారు. దాంతో ఎంఎల్ఏకి ఇటు యార్లగడ్డ అటు దుట్టా వర్గాలతో సమస్యలు పెరిగిపోయాయి.

వంశీతో కలిసి పనిచేయాలని యార్లగడ్డకు అందరిముందు జగన్ చెప్పారు. జగన్ చేసిన సయోధ్యతో నేతలంతా ఒకటిగా పనిచేస్తారని అందరు అనుకున్నారు. అయితే జగన్ పర్యటన తర్వాత ఇదంత సులభం కాదనే విషయం అర్ధమైపోయింది. ఎందుకంటే వంశీ, యార్లగడ్డలు కలిసి పనిచేయాలంటే ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇప్పించినంత సులభం కాదు.  వీరి విషయంలో జగన్ ఇంకేదన్నా ప్లాన్ వేయాలి మరీ..

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

టీడీపీ కి వారే శత్రువులుగా మారుతున్నారా..?

వారిని రమ్మని జగన్ ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నాడా..

చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -