Sunday, April 28, 2024
- Advertisement -

గంగవ్వ ఆరోగ్యం ఇప్పుడెలా ఉందో తెలుసా ?

- Advertisement -

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గంగవ్వ అందరికి మంచి పోటీ ఇచ్చింది. కానీ హఠాత్తుగా ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఆరోగ్యం బాగలేదన్న కారణంతో బయటకు వెళ్తాను అని గత వారం రోజుల నుండి గంగవ్వ అంటూనే ఉంది. ఆరోగ్యం విషయం దృష్టిలో పెట్టుకుని ఆమెను నాగార్జున బయటకు పంపించారు.

అయితే ఈ సీజన్ లో గంగవ్వకు మంచి క్రేజ్ ఏర్పడింది. త‌న వాక్చాతుర్యంతో కుర్ర కంటెస్టెంట్ల‌ను కూడా హ‌డ‌లెత్తించేది. ఏదైనా త‌ప్పు జ‌రిగిన‌ట్లు అనిపిస్తే ఏమాత్రం సంకోచించ‌కుండా ముఖం మీదే తిట్టేది. హౌస్ లో ఎవరైన కంటతడి పెడితే ఆమె మనసు తరుక్కుపోయేది. వెళ్లి త‌న చీర‌కొంగుతో క‌న్నీళ్లు తుడుస్తూ త‌ల్లిలా ఊరుకోబెట్టేది. బిగ్‌బాస్ హౌస్‌లో అంద‌రికీ ప్రేమ‌లు పంచి, ప్రేక్ష‌కుల గుండెల్లో గొప్ప స్థానాన్ని ద‌క్కించుకున్న అవ్వ ఆరోగ్యం ఇప్పుడెలా ఉందన్న ప్రశ్న అందర్ని కలవర పరుస్తోంది.

దీంతో మై విలేజ్ షో టీం అవ్వ ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇచ్చారు. గంగ‌వ్వ ఆరోగ్యం చాలా సేఫ్‌గా ఉందని, ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని స్ప‌ష్టం చేసింది. డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు ఒక వారం స్పెష‌ల్ కేర్‌లో ఉంచామ‌ని పేర్కొన్నారు. ఇక గంగవ్వ హౌస్ నుండి వెళ్ళేముందు నాగార్జున ఓ ఇంటిని కట్టిస్తానని మాట ఇచ్చాడు. అందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.

రష్మీతో తనకున్న సంబంధం గురించి చెప్పిన సుధీర్..!

అనిల్ రావిపూడి కి ఏ దిక్కు లేకనే ఈ సినిమా చేస్తున్నాడా..

డబ్బులు లేక పెట్రోల్ బంక్ లో పని చేసిన రాజ్ తరుణ్..!

ఎస్పీబీ విషయంలో చంద్రబాబు ఇంత చీప్ గా చేశాడేంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -