Sunday, May 19, 2024
- Advertisement -

చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత..

- Advertisement -

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టులోనూ ఊరట లభించలేదు. బాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది న్యాయస్థానం. దీంతో చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ అంటూ ఏకవాక్యంతో తీర్పు వెలువరించారు న్యాయమూర్తి. సీఐడీ న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో మరికాసేపట్లో ఏసీబీ కోర్టు చంద్రబాబును 5 రోజుల కస్టడీకి సంబంధించిన తీర్పు వెలువరించనుంది.క్వాష్ పిటిషన్ నేపథ్యంలో ఇప్పటివరకు కస్టడీ తీర్పును వాయిదావేస్తు వస్తోంది ఏసీబీ కోర్టు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో తన పేరును తొలగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దేశ పూర్వకంగా తనను ఇరికించారని తన వాదనలో పేర్కొన్నారు. అయితే ఈ కేసును ఏకవాక్యంతో డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు.దీంతో చంద్రబాబు ముందున్న దారులన్నీ మూసుకుపోయాయి.

ఈ కేసులో ఫిర్యాదే ఓ అభూత కల్పన అని, ఎఫ్‌ఐఆర్‌ చట్టవిరుద్ధంగా ఉందంటూ తమ వాదనలు వినిపించారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు. ప్రధానంగా సీఆర్పీసీ 17ఏ పై వాదనలు వినిపించారు. ఏ గణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడుతో పాటు చంబునాథ్ మిశ్రా కేసులో తీర్పులను వివరిస్తూ… ఈ దశలో నిందితుడికి అనుకూలంగా హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని కోరారు.హైకోర్టులో తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంని ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -