Saturday, May 18, 2024
- Advertisement -

కత్తి మహేష్ ఇష్యూ- జగన్ తెలివైన నిర్ణయం…. బాబు సెల్ఫ్ గోల్

- Advertisement -

తన అనుభవం అంత వయసు కూడా జగన్‌కి లేదు అని చంద్రబాబు తరచూ చెప్పుకుంటూ ఉంటాడు. కానీ విభజన నాటి నుంచీ ఇప్పటి వరకూ కూడా జగన్ కంటే ఎక్కువ స్థాయిలో ఆలోచించి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే తెలుగు దేశం నాయకులు, ఆ పార్టీ భజన మీడియా కూడా స్పష్టంగా చెప్పలేరు. జనాలను మోసం చేసే నిర్ణయాలు, కుట్ర రాజకీయాల విషయంలో మాత్రం చంద్రబాబును తలదన్నే స్థాయి నాయకుడు దేశంలోనే లేడని చెప్పొచ్చని జాతీయ స్థాయి పార్టీ నాయకులు అభిప్రాయపడుతూ ఉంటారు. అధికారం కోసం ఎంత దిగజారుడు రాజకీయాలైనా చేయగల సామర్థ్యం బాబు అండ్ ఆయన భజన మీడియా సొంతం మరి.

ఇక రుణమాఫీల లాంటి ఎన్నికల హామీలు నెరవేర్చడం అసాధ్యం అని జగన్ చెప్పినా వినకుండా జనాలను మోసం చేసిన బాబు, ప్యాకేజ్‌కి ఒప్పుకోవద్దు అని జగన్ చెప్పినా వినకుండా హోదా వేస్ట్, ప్యాకేజ్ బెస్ట్ అని మరోసారి ఆంద్రప్రదేశ్ జనాలను ముంచిన బాబు ఇప్పుడు రాజకీయాల విషయంలో కూడా జగన్ స్థాయిలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. ఫిల్మ్ క్రిటిక్ మహేష్ కత్తికి మొదటి నుంచీ కూడా వైకాపాలో చేరాలన్న ఆలోచన ఉంది. జగన్‌ని కలవడానికి ప్రయత్నాలు కూడా చేశాడు. అయితే జగన్ మాత్రం మహేష్ కత్తిని కలవడానికి ఇష్టపడలేదు. టిడిపికి మద్దతు ఇస్తూ ఉన్నప్పుడే పవన్‌పై మహేష్ కత్తి విరుచుకుపడ్డాడు. అయినప్పటికీ జగన్ మాత్రం మహేష్ కత్తితో సంబంధాలు వద్దని వైకాపా నాయకులకు కూడా స్పష్టంగా చెప్పాడు.

అయితే చంద్రబాబు ఆయన భజన మీడియా మాత్రం మహేష్ కత్తిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో చంద్రబాబు జేబులో బొమ్మ అని అందరూ చెప్పే ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబుతో పాటు మహేష్ కత్తిని కూడా ప్రత్యేకంగా ఫ్లైట్‌లో పంపించి మరీ బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు టిడిపి నాయకులు. ఇక టిడిపికి మద్దతుదారులైన ఎబిఎన్ ఆంద్రజ్యోతి, మహాటీవీ, టివి9లు కత్తిని ఓ స్థాయిలో ప్రోత్సహించాయి. ఇప్పుడు రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం టిడిపికి, ఆ పార్టీ భజన మీడియాకు కూడా చుట్టుకుంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రేపటి నుంచీ చిత్తూరు జిల్లాలోనే ఉండనున్నాడు మహేష్ కత్తి. ఇప్పుడు కూడా మహేష్ కత్తిని భజన మీడియా ఛానళ్ళ స్టూడియోలలో కూర్చోబెట్టి డిష్కషన్స్ పెట్టినా, మరోసారి టిడిపి నాయకులతో కలిసి మహేష్ కత్తి కనిపించినా 2019 ఎన్నికల్లో మొత్తానికే హిందూ ఓట్లన్నీ దూరమై పుట్టిమునగడం ఖాయమన్న ఆందోళన టిడిపి నాయకుల్లో వ్యక్తమవుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు మహేష్ కత్తిని వైకాపాలో చేర్చుకోకుండా వైఎస్ జగన్ చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నారని వైకాపా నాయకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -