Sunday, May 19, 2024
- Advertisement -

‘నేను బలహనీపడితే ఎపి నష్టపోతుంది’….. బాబు బ్రహ్మీ డైలాగ్స్…!

- Advertisement -

నా కాళ్ళు కడగాలని ఎన్టీఆర్ తహతహలాడిపోయాడు….. ఇందిరకు చెప్పి వైఎస్‌కి నేనే టిక్కెట్ ఇప్పించా…..ఇండియాలోనే నా అంత సీనియర్ నాయకుడు లేడు……ఇవీ వరుసగా చంద్రబాబు వదుల్తున్న బ్రహ్మీ డైలాగ్స్. ఆ మధ్య సింధుకు నేనే పతకం తెప్పించా, సత్య నాదెళ్ళను నేనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ని చేశా అనే డైలాగుల నుంచీ ఇప్పుడు మరోస్థాయికి ఎదిగాడు చంద్రబాబు. ఎన్టీఆర్ టీడిపిని స్థాపించినప్పుడు చంద్రబాబు ఇందిరా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఘోరంగా ఓడిపోయాడు. ఇక ఆ టైంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ హవాలో కూడా ఘన విజయం సాధించాడు. ఆ తర్వాత కాలంలో ఇందిర చనిపోయారు. చంద్రబాబేమో ఎంచక్కా అధికారంలో ఉన్న మామ చంక ఎక్కారు. ఇక ఇందిరకు చెప్పి వెఎస్‌కి చంద్రబాబు ఎప్పుడు టికెట్ ఇప్పించినట్టు?

ఆ విషయాలు పక్కన పెడితే నేను బలహీనపడితే ఎపి బలహీనపడుతుంది అన్నది చంద్రబాబు ఇప్పుడు తరచుగా వినిపిస్తున్న డైలాగ్. రాజకీయాలపైన కనీస అవగాహన ఉన్నవాళ్ళుకూడా బాబు డైలాగ్ విన్న వెంటనే………..ఛ…….నిజమా…..? గతంలో ఎప్పుడు సీమాంధ్రకు బలం అయ్యావు స్వామీ అని ప్రశ్నిస్తున్నారు.

ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి తెలుగు నేలపై నుంచి జాతీయ రాజకీయాల్లో కూడా హవా చూపిస్తున్న ఒక గొప్ప నాయకుడిని పొట్టనపెట్టుకున్నారు. అఫ్కోర్స్…….. ఎన్టీఆర్ ఇందిరను ఎదుర్కోవడం, జాతీయ రాజకీయాల్లో చూపించిన హవా అంతా తనదే అని ఇప్పుడు బాబు తనదైన స్టైల్‌లో అబద్ధపు ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. ఇక 2004 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సీమాంధ్రుల కష్టం మొత్తాన్ని హైదరాబాద్‌పై ఖర్చుపెట్టి సీమాంధ్రప్రాంతాన్ని సర్వనాశనం చేశాడు. సీమాంధ్ర ప్రాంతానికి అత్యంత కీలకంగా నిలిచిన రాష్ర్ట్ర విభజన సమయంలో చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతం, ప్రజల ప్రయోజనాల విషయంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించాడు అన్నది నిజం. తెలంగాణా ఇస్తారా? ఇవ్వరా? సోనియాను డిమాండ్ చేస్తూ లేఖలు రాశాడు. ఇక చివరి నిమిషంలో కూడా తెలంగాణాలో తన పార్టీ పెట్టుబడిదారులు, తన భజన మీడియా అధినేతల ఆస్తుల ప్రయోజనాలకు కట్టుబడి రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ సీమాంధ్ర పూర్తిగా నష్టపోవడానికి కారణమయ్యాడు. వైఎస్ కూడా చనిపోయి ఉన్న నేపథ్యంలో సీమాంధ్ర నుంచి సీనియర్ మోస్ట్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తూ, తన చేతకానితనంతో సీమాంధ్రను నిండా ముంచాడు. ఆ సమయంలో సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న టిడిపి కార్యకర్తలతో సహా ప్రజలందరూ కూడా ‘వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే బాగుండు’ అని మనస్ఫూర్తిగా కోరుకున్నారన్నది నిజం.

ఇక విభజన తర్వాత ఎన్నో అబద్ధాలు, విభజనకు సహకరించినప్పటికీ మోడీ క్రేజ్‌ని క్యాష్ చేసుకున్న ప్రయత్నాలు, పవన్ లాంటి నటనాయకుడి సపోర్ట్‌తో అధికారంలోకి వచ్చాడు. కానీ ఏం లాభం? నాలుగేళ్ళలో సీమాంధ్రులకు ఏ ఒక్క క్షణం కూడా భరోసా ఇవ్వలేకపోయాడు చంద్రబాబు. ప్రచార పటాటోపం తప్ప ఆచరణలో సీమాంధ్రులకు నమ్మకం కలిగించలేకపోయాడు. విభజన గాయం మానిపోయేలా చేస్తాడు అనుకుంటే……. నాలుగేళ్ళ తర్వాత సీమాంధ్ర ప్రజలు పూర్తిగా నిరాశలో మునిగిపోయేలా చేశాడు.

అలాంటి చంద్రబాబు ఇప్పుడు నేను బలహీనపడితే ఎపి కూడా బలహీనపడుతుంది అంటే సీమాంధ్ర ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. అసలు చంద్రబాబు బలంగా ఉన్న ఈ నాలుగేళ్ళలో అయినా అంతకుముందు అయినా సీమాంధ్ర బాగు పడింది ఏంటి? సీమాంధ్ర ప్రజలకు చంద్రబాబు చేసింది ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబుకు మాత్రం ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు. ఆయన చెప్పాలనుకున్న అబద్ధాలు చెప్పుకుంటూ పోతాడు. ఎర్రి మాలోకాలు అయిన జనాలు తాను చెప్పే అబద్ధాలను గుడ్డిగా నమ్ముతారు అన్నది చంద్రబాబు నమ్మకం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -