Saturday, May 18, 2024
- Advertisement -

ఓటుకు కోట్లు కేసుకు భయపడుతున్నాం….బాబు ఒప్పుకోలు

- Advertisement -

ఓటుకు కోట్లు అవినీతి, అక్రమ వ్యవహారం బయటపడిన వెంటనే తప్పు కప్పిపుచ్చుకోవడానికి శివాలెత్తిపోయి మరీ రంకెలు వేశాడు బాబు. ఆ తర్వాత మాత్రం సైలెంట్‌గా తెరవెనుక కెసీఆర్‌తో బేరం కుదుర్చుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా కెసీఆర్‌కి భయపడుతున్నాడా? ఓటుకు కోట్లు కేసు విషయంలో కెసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటాడో…….కెసీఆర్‌ని అడ్డుపెట్టుకుని మోడీ ఎక్కడ తనను జైలుకు పంపిస్తాడో అని చంద్రబాబు ఆందోళన చెందుతున్నాడా? వైకాపాతో పాటు ఇతర పార్టీలన్నీ కూడా చంద్రబాబు భయపడుతున్నాడనే చెప్తాయి. అయితే స్వయంగా చంద్రబాబే ఇప్పుడు మరోసారి ఓటుకు కోట్లు కేసుకు, కేసీఆర్‌కి తాను ఏ స్థాయిలో భయపడుతున్నాడో స్వయానా నిరూపించుకున్నాడు. ప్రజలకు స్పష్టంగా చెప్పేశాడు.

తెలంగాణా టిడిపి మహానాడు అంటూ ఏర్పాటు చేసిన సభలో కెసీఆర్ అంటే తనకు ఎంత భయమో స్వయంగా చెప్పేశాడు చంద్రబాబు. ముందుగా ఈ సభ ప్రారంభ కార్యక్రమాల సందర్భంగా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌పై, ముఖ్యమంత్రి కెసీఆర్‌పై ప్రజల కష్టాల గురించి ఒక సాంస్కృతిక బృందం వ్యంగ్య రూపకం ప్రదర్శిస్తూ ఉన్నది. అందులో కెసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ చాలా మాటలే ఉన్నాయి. వెంటనే అలర్ట్ అయిన చంద్రబాబు…….ఆ కళా రూపకాన్ని ఆపివేయమని తన పక్కనున్నవాళ్ళతో చెప్పడంతో అర్థాంతరంగా ఆపేసి…….ఆ కళాకారులను వేదికపై నుంచి కిందికి పంపించేశారు.

ఇక చివరిలో చంద్రబాబు ప్రసంగం సందర్భంగా కూడా కనీసం కేసీఆర్ పేరు ప్రస్తావించే ధైర్యం కూడా చేయలేకపోయాడు చంద్రబాబు. 2019లో తెలంగాణాలో అధికారంలోకి వస్తాం అన్న చంద్రబాబు కనీసం తెలంగాణా ప్రజలు కష్టాలుపడుతున్నారని కూడా చెప్పలేకపోయాడు.

బేగం పేట్ ఎయిర్ పోర్ట్ నేనే నిర్మించా లాంటి కామెడీ డైలాగులు మాత్రం పేల్చాడు. తెలంగాణాలో టిడిపి అధికారంలోకి వస్తుంది అని చెప్పి తెలంగాణా టిడిపి నేతలకు ధైర్యం చెప్పాలనుకున్న బాబు కెసీఆర్ అంటే తనకు ఎంత భయమో, ఓటుకు కోట్లు కేసు విషయంలో ఎంతలా ఆందోళన చెందుతున్నాడో అన్న విషయాలను ఆ రకంగా అందరికీ అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పేశాడు చంద్రబాబు. కెసీఆర్‌పై భయంతోనే విభజన తర్వాత తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన ప్రయోజనాలను తాకట్టుపెట్టేసిన చంద్రబాబు ఇంకా సీమాంధ్రులకు ఏ స్థాయిలో నష్టం చేస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -