Friday, April 19, 2024
- Advertisement -

తనకు కరోనా ఎలా వచ్చిందో చెప్పి అందరినీ నవ్వించిన సీఎం కేసీఆర్!

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన పరంగానే కాదు తనదైన వాడీ వేడీ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలపై విరుచుకు పడుతుంటారు. ఇక ఏదైనా మీటింగ్స్ లో ఆయన వేసే పంచులు, సామెతలు చూస్తే పడీ పడీ నవ్వుతుంటారు. తాజాగా సిద్ధిపేటలో జరిగిన ఓ సమావేశంలో కేసీఆర్ ఆసక్తికరంగా ప్రసంగిస్తూ, తనకు కరోనా ఎలా సోకిందో కామెడీగా వివరించారు.

ఇటీవల ఆయన కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. ఆ మద్య నేను ఓ పెళ్లికి వెళ్లానని.. అక్కడ పెళ్లి కొడుకు నా మాస్క్ తీయాలని కోరాడు. ఎందుకు అని అడిగితే.. సార్ మీరు నాకు మళ్లీ ఎప్పుడు దొరుకుతారు.. మీతో ఫోటో తీయించుకోవాలనే కోరిక సార్ అన్నాడు.

నీకు దొరుకుడేమో కానీ కరోనాకి మాత్రం నేను దొరుకుతాను రా బాబూ అన్నాను. ఆ విధంగా నా మాస్కును వాడు లాగి, వీడు లాగి చివరికి నాక్కూడా కరోనా వచ్చింది” అని అందరిలోనూ నవ్వులు పూయించారు.

ఈ ఐదు సూత్రాలు తప్పకుండా పాటించండి.. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

గుడికో గోమాతా.. టీటీడీ అద్భుత కార్యక్రమం..!

పవన్ నిర్ణయం ఆ అగ్ర నిర్మాతకు భారంగా మారిందా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -