Friday, April 26, 2024
- Advertisement -

బ్లాక్​ఫంగస్​తో కళ్లే కాదు.. పళ్లకు కూడా ప్రమాదమే..!

- Advertisement -

ఇటీవల దేశ వ్యాప్తంగా బ్లాక్​ ఫంగస్​ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా తర్వాత అంతలా భయపెడుతున్న వ్యాధి బ్లాక్​ ఫంగస్​. కరోనా చికిత్సలో భాగంగా.. స్టెరాయిడ్స్​ వాడుతున్న వారిలో బ్లాక్​ ఫంగస్​ సంక్రమిస్తున్నది. ఈ వ్యాధి ముఖ్యంగా కళ్లపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నది.

బ్లాక్​ ఫంగస్​ చికిత్సలో భాగంగా ఇప్పటికే చాలా మందికి కళ్లు కూడా తొలగించారు. ఇదిలా ఉంటే బ్లాక్​ ఫంగస్​తో కళ్లతో పాటు.. దంతాలు కూడా ఎఫెక్ట్​ అవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్​ ఫంగస్​ వచ్చిన వాళ్లల్లో దవడల నొప్పి.. పళ్ల చిగుళ్ల వాపు, చీము, రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి.. కరోనా చికిత్స లో భాగంగా స్టెరాయిడ్స్​ తీసుకున్నవారికి పై లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్​ను సంప్రదించాలని కోరుతున్నారు.

కరోనా వైరస్​తో దంతాలకు రక్త సరఫరా జరిగే నాళాల్లో క్లాట్​లు ఏర్పడి అవకాశం ఉంది. దీంతో అక్కడ రక్త సరఫరా నిలిచిపోయి.. ఫంగస్​ ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా పై దవడ భాగంలో రక్త ప్రసరణ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కణజాలం కుళ్లిపోయే అవకాశాలు తక్కువ.

కొవిడ్​ చికిత్సలో స్టెరాయిడ్లు ఎక్కువగా వాడిన వారిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి. సైనస్​లు వెనక దంతాల పై భాగంలో ఉంటాయి. కొందరికి దంతాలు సైనస్​లలోకి వుంటాయి. అవన్నీ ఒక దానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి కాబట్టి.. సైనస్​లపై బ్లాక్​ఫంగస్​ దాడి చేస్తే అది దంతాలకూ వ్యాపించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

Also Read

థర్డ్​వేవ్​తో పిల్లలకు ప్రమాదం లేదు..! మరో అధ్యయనం

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -