Tuesday, April 30, 2024
- Advertisement -

గుడికో గోమాతా.. టీటీడీ అద్భుత కార్యక్రమం..!

- Advertisement -

ఇటీవల టీటీడీ ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తిరుపతిలో ప్లాస్టిక్​ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధించారు. స్వచ్ఛమైన గోవుల నెయ్యిని తిరుపతి లడ్డూలో వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణాలను చేపట్టింది. శనివారం టీటీడీ పాలక మండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది.

త్వరలో తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ ఆధ్వర్యంలో 500 ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నది. అంతేకాక దేశవ్యాప్తంగా కూడా ఆలయాలను నిర్మించబోతున్నారు. వీటితో పాటు గుడికో గోమాత అనే ఓ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్​ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు.

జమ్మూ కాశ్మీర్ లో 62 ఎకరాల్లో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన, 18 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాదిలో వారణాసి, ముంబైలోనూ ఆలయాలు నిర్మిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గో ఆధారిత నైవేద్యం అనే బృహత్తర కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -