ఎన్టీఆర్‌ ది గొప్ప మనసు.. అందుకే అంత గౌరవం : సీఎం కేసీఆర్

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నట సార్వభౌముడు ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా తన సత్తా ఏంటో చాటారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేసి ప్రజల హృదయాలు గెల్చుకున్నారు. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ ని గుర్తు చేసుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని, అది తనకెంతో నచ్చిన పథకమని చెప్పారు కేసీఆర్. ఆ పథకం వల్లే ఎంతోమంది ఆకలి తీరిందని గుర్తుచేశారు కేసీఆర్. ఆ తర్వాత ఎన్నో మార్పులు జరిగి, ఇప్పుడు మనం రూపాయికే కిలో బియ్యం ఇచ్చుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

- Advertisement -

రెండు రూపాయల బియ్యంతో ఎంతో మంది పేద ప్రజలు బుక్కడు అన్నం తింటున్నారని అన్నారు. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని.. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రం పంజాబ్‌ను అధిగమించినట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. వాక్‌శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధితోనే ఇదంతా సాధ్యమైందని అన్నారు.

తనకు కరోనా ఎలా వచ్చిందో చెప్పి అందరినీ నవ్వించిన సీఎం కేసీఆర్!

బ్లాక్​ఫంగస్​తో కళ్లే కాదు.. పళ్లకు కూడా ప్రమాదమే..!

పుజారా కు తప్పిన పెను ప్రమాదం.. బాల్ తగిలి పగిలిన హెల్మెట్!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -