ఈ ఐదు సూత్రాలు తప్పకుండా పాటించండి.. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

- Advertisement -

దేశంలో ఇంకా కరోనా కేసులు తగ్గనేలేదు. మరోవైపు థర్డ్​వేవ్​ వస్తుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 60 వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా వేలల్లో నమోదవుతున్నాయి. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్​డౌన్​ నిబంధనలు పూర్తిస్థాయిలో ఎత్తేశాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో లాక్​డౌన్​ మొత్తానికే ఎత్తేశారు.

రాష్ట్రంలో ఎటువంటి ఆంక్షలు అమల్లో లేవని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా 21వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ మాత్రమే అమల్లో ఉంటుంది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. తమిళనాడులో ఇవాళ కేబినెట్ భేటీ కానుంది. అక్కడ కూడా లాక్ డౌన్ ఎత్తేసి స్వల్పంగా ఆంక్షలు అమలులోకి తేనున్నట్లు సమాచారం.

మరోవైపు జూలై నుంచి విద్యాసంస్థలు కూడా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో థర్డ్​వేవ్​లో పిల్లలకు కరోనా సోకితే పరిస్థితి ఏమిటని కొందరు ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పలు మార్గ దర్శకాలు విడుదల చేసింది. ఐదు సూత్రాలు కచ్చితంగా పాటించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

ప్రతి రాష్ట్రంలో కచ్చితంగా టెస్ట్, ట్రాక్, ట్రీట్మెంట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా .. ఈ ఐదు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం సూచించింది. అంతేకాక ఇప్పటికే లాక్​డౌన్​ ఎత్తేసిన రాష్ట్రాలు యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగించాలని సూచించింది.

Also Read

థర్డ్​వేవ్​తో పిల్లలకు ప్రమాదం లేదు..! మరో అధ్యయనం

వ్యాక్సిన్​తో లైంగికసామర్థ్యం తగ్గదు..! తేల్చిచెప్పిన అధ్యయనం..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -