Thursday, May 16, 2024
- Advertisement -

టీడీపీ, కాంగ్రెస్ అభ్య‌ర్తుల ఖ‌ర్చు ఎవ‌రిపైనా…?

- Advertisement -

తెలంగాణాలో ముందస్తు ఎన్నిక‌ల‌కు రంగం అంతా సిద్ధం అయ్యింది. ఈసీ కూడా చ‌క‌చ‌కా ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీనీ ర‌ద్దుచేసి ఎన్నిక‌ల హీట్‌ను పెంచారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుంకు పార్టీల‌న్నీ ఏకమ‌య్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. అస‌లు విష‌యానికి వ‌స్తే కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు దాదాపు ఖ‌రార‌య్యింది. సీట్ల పంప‌కం కూడా పూర్త‌య్యింద‌ని స‌మాచారం.

ఎన్నిక‌లంటే ఆషా మాషీ కాదు. వంద‌ల కోట్ల ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. ఇప్పుడు తెలంగాణాలో ఎన్నిక‌ల ఖ‌ర్చు ఎవ‌రు భ‌ర‌స్తార‌నే విష‌యంపై కాంగ్రెస్‌, టీడీపీల మ‌ధ్య తీవ్ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. టిఆర్ఎస్ అభ్య‌ర్ధుల ఖ‌ర్చుల కోసం నిధుల‌ను కెసిఆర్ రెడీ చేశార‌ని స‌మాచారం. ఇక భాజాపాకు కూడా నిధుల స‌మ‌స్య ఉండ‌దు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబ‌ట్టి అక్క‌డ నుంచి నిధులు వ‌స్తాయి.

ఎంత‌లేద‌న్నా ఒక్కో నియోజ‌క వ‌ర్గానికి రూ 25 నుంచి 30 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌నేది అంచ‌నా. ప్ర‌ధాన పార్టీల త‌ర‌పున పోటీ చేయాల‌ని అనుకుంటున్న ఏ అభ్య‌ర్ధికైనా ఆ ఖ‌ర్చు త‌ప్ప‌దు. తెలంగాణాలో కాంగ్రెస్, టిడిపిలు ప్ర‌తిప‌క్షాల్లోనే ఉన్నాయి కాబ‌ట్టి ఆదాయ మార్గాలు లేవు.

ఇక ఏపిలో తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉంది కాబ‌ట్టి రెండు పార్టీల అభ్య‌ర్ధుల ఖ‌ర్చుల‌ను భ‌రించాల్సిన బాధ్య‌త ప్ర‌ధానంగా చంద్ర‌బాబునాయుడు మీదే ఉంది. త‌నంత‌ట తానుగా కాంగ్రెస్ తో పొత్తుల‌కు రెడీ అవ్వ‌టంతో పాటు కెసిఆర్ ను గ‌ద్దె దింప‌ట‌మే ఏకైక ల‌క్ష్యంగా పెట్టుకున్నారు కాబ‌ట్టి కాంగ్రెస్ అభ్య‌ర్ధుల ఖ‌ర్చుల‌ను పెట్టుకోవ‌టానికి వెన‌కాడ‌ర‌నే అనుకుంటున్నారు.

చంద్ర‌బాబు మాట‌లు చూస్తే పాలు, కూర‌గాయ‌లు అమ్ముకొనే జీవిస్తున్నామ‌ని అనేక సార్లు వెల్ల‌డించారు. చేతికి పెట్టుకోవ‌డానికి ఉంగ‌రం, గ‌డియారం లేని మ‌హానుభావుడుకాదా…! మ‌రి ఎన్నిక‌ల ఖర్చు పెట్టుకుంటారా లేకా అన్ని నిధులు ఎక్క‌డ‌నుంచి స‌ర్దుతారా అన్న‌ది తెలాల్సిఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -