Sunday, May 19, 2024
- Advertisement -

రేవంత్‌పై క‌ఠ‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీ టీడీపీ పోలిట్ బ్యూరోలో తీర్మానం…?

- Advertisement -

వారం రోజులు తెలంగాణా టీడీపీలో రేవంత్ రెడ్డి ముస‌లం ముదురుతోంది. ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుళ్ గాంధీని క‌ల‌సి వ‌చ్చ‌న‌ప్ప‌టినుంచి పార్టీలో గంద‌ర‌గోలం నెల‌కొంది. వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌,ఫైర్ బ్రాండ్ గా పేరుత తెచ్చుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నార‌నె వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇప్ప‌టికె ఏపీ మంత్రుల‌మీద రేవంత్ తీవ్ర ఆరోప‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

రేవంత్ వ్య‌వ‌హారంపై తెలంగాణా టీడీపీ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించింది. స‌మావేశంలో రేవంత్‌, మోత్కుప‌ల్లి న‌ర‌శింహులు, మ‌ధ్య వాగ్వాదం జ‌రిగిన సంగ‌తి తెల‌సిందే. దీంతో స‌మావేశం నుంచి అర్థాంత‌రంగా వెల్లిపోయారు రేవంత్‌. అయితె ఇప్పుడు తాజాగా రేవంత్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకొనేందుకు రంగం సిద్ధ‌మ‌య్యింది. దీనికోసం టీటీడీపీ పొలీట్ బ్యూరో స‌మావేశం నిర్వ‌హించారు.

రేవంత్ ను పదవి నుంచి తొలగించాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు పొలిట్ బ్యూరో లేఖ రాసింది. పార్టీ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించిన రేవంత్ రెడ్డికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరాదంటూ లేఖలో కోరింది. కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలను కూడా రేవంత్ ఇంతవరకు ఖండించలేదని… అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో టీటీడీపీ పొలిట్ బ్యూరో ఈ మేరకు తీర్మానించింది. చంద్రబాబు విదేశీ పర్యటన ముగిసేలోగానే రేవంత్ పై వేటు పడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -