Sunday, May 19, 2024
- Advertisement -

బాబులో ఓటమి భయం టిడిపి ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెంచిందా?

- Advertisement -

తొక్కేస్తా, చించేస్తా అని పలుకుతూ అలవిమాలిన ధైర్యసాహసాలు ప్రదర్శించే నాయకుడే సడన్‌గా ఓటమి గురించి మాట్లాడడం మొదలెడితే…………నాయకులందరికీ మన గెలుపును ఎవ్వడూ ఆపలేడు అని అస్తమానం ధైర్యం చెప్పే అధినాయకుడిలోనే ఓటమి భయం కనిపిస్తే……..ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీలో ఉన్న నాయకుల పరిస్థితి ఏంటి? తాజాగా టిడిపి నాయకుల అంతర్గత సమావేశంలో ఇదే పరిస్థిితి కనిపించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలతో సమావేశం అయిన చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి మాట్లాడతాడు అనుకుంటే ఎవ్వరూ ఊహించని విధంగా 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి గురించి మాట్లాడడం తెదేపా ఎమ్మెల్యేలను షాక్‌కి గురిచేసింది.

తాను వ్యక్తిగతంగా చేయించిన సర్వేలో దాదాపు సగం మందికి పైగా ఎమ్మెల్యేలు ఓడిపోతారని తేలిందని చంద్రబాబు ఎమ్మెల్యేలతో చెప్పడంతో ఎమ్మెల్యేలు షాక్ తిన్నారు. 2019 ఎన్నికల్లో మొత్తం ఎంపి సీట్లన్నింటిలో గెలుస్తాం, ఎనభై శాతం పైగా ఎమ్మెల్యే సీట్లు మనవే, ఎనభై శాతం కంటే ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు టిడిపి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు అని అనుక్షణం తన డబ్బా తానే కొట్టుకునే చంద్రబాబు సడన్‌గా ఓటమి గురించి మాట్లాడడం, ప్రజల్లో టిడిపి ప్రభుత్వం పట్ల, అధికార పార్టీ ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకత గురించి ఆందోళన వ్యక్తం చేయడం టిడిపి ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించింది. ఇప్పటి వరకూ జాతీయ స్థాయి సర్వేల్లో కూడా 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి ఖాయం అని తేలినప్పటికీ చంద్రబాబు, ఆయన భజన మీడియా ఇచ్చిన భరోసాతో ధైర్యంగా ఉన్నారు టిడిపి ఎమ్మెల్యేలు. 2014లో కూడా జగన్ చేతిలో ఓడిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ రుణమాఫీ హామీలతో పాటు మోడీ, పవన్ మద్దతుతో గెలిచినట్టుగానే ఈసారి కూడా బాబు ఏదో ఒక మేజిక్ చేస్తాడు అన్న నమ్మకంలో టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయితే చంద్రబాబు మాత్రం ఈ సారి అలాంటి అస్త్రాలు ఏమీ లేవని, ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి ఖాయం అని గట్టిగా చెప్పడం ఇప్పుడు టిడిపి నాయకుల్లో టెన్షన్ పెంచుతోంది. అభ్యర్థులను మారిస్తే తప్ప దాదాపు సగం మందికి పైగా ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయం అని చంద్రబాబు అన్న మాటలు అయితే టిడిపి నేతలందరికీ శరాఘాతంలా తగిలాయి. మొత్తానికి చంద్రబాబుకు వాస్తవ పరిస్థితులు అయితే అర్థమైనట్టుగా ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా తక్కువ టైమే ఉన్న నేపథ్యంలో పోల్ మేనేజ్‌మెంట్, ప్రచార వ్యూహాలతో 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబు గట్టెక్కగలడా? చంద్రబాబు ప్రచార వ్యూహాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి ఓట్లేస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే టిడిపి ఎమ్మెల్యేల మెదళ్ళలో ఓ స్థాయిలో టెన్షన్ పెంచుతున్నాయి. చంద్రబాబు ప్రచార మాయ 2019 ఎన్నికల్లో వర్కవుట్ అయ్యే ఛాన్సే లేదంటున్న విశ్లేషకుల మాటలు, 2019 ఎన్నికల్లో టిడిపి గెలిచే ఛాన్సే లేదని తేల్చి చెప్తున్న సర్వేల నేపథ్యంలోనే టిడిపి విజయంపై ఆ పార్టీ నాయకుల్లో కూడా ఇప్పటికే చాలా సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు ఓటమి భయం నేపథ్యంలో తెలుగు దేశం ఎమ్మెల్యేల్లో ఆందోళన తారాస్థాయిలో ఉండడం 2019 ఎన్నికల ఫలితాలను తీవ్రస్థాయిలో ప్రభావితం చెయ్యడం ఖాయం అన్న అభిప్రాయాలు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -