Sunday, May 19, 2024
- Advertisement -

టీడీపీకి మరో షాక్.. వైసిఫీలోకి మాజీ మంత్రి

- Advertisement -

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైన విజయం సొంతం చేసుకోవాలని.. ఆ దిశగా పార్టీని ముందుకు నడిపేందుకు జగన్ ప్లాన్ రచిస్తున్నారు. అందులో భాగంగా జగన తన పార్టీ నేతలకు ఓ పిలుపునిచ్చారు. తమ పార్టీలో ఎవరు చేరుతామన్న.. చేర్చుఖోవాలని జగన్ పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఇప్పటికే పార్టీలో ఎంతో మంది నాయకులు చేరారు.

ఒక చిన్న నాయకుల నుండీ.. మాజీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ అందరూ వైసీపీలో చేరేందు వరసగా వస్తున్నారు. తాజాగా వైసిపీలో గతంలో చేరి.. అక్కడ నాయకులతో పొసగక పార్టీ మారిన నాయకుడు మాజీ మంత్రి కొత్త పల్లి సుబ్బారాయుడు. ఆయన వైసీపీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు అని తెలుస్తోంది. గతంలో పశ్చిమ గోదవరి జిల్లా టీడీపీ అధ్యక్షనిగా ఉండీ పలు బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. అలానే రాష్ట్రంలో టీడీపీ సర్కార్ కాలంలో మంత్రుగా కూడా పని చేశారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో కొనసాగారు. అయితే కొత్తపల్లి సుబ్బారాయుడుకు.. లేదా ఆయన తమ్ముడు కొత్త పల్లి జానకీరామ్ కు నరసాపురం ఎమ్మెల్యే సీటు వస్తుందని అనుకున్నారు. కానీ 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున కొత్త పల్లి సుబ్బారాయుడికి జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కానీ ఆయనపై టీడీపీ అభ్యర్ధి బండారు మాధవనాయుడు విజయం సాధించారు. దాంతో ఆయన మళ్లీ టీడీపీ గూటికి వెళ్లారు. అయితే ఆయన టీడీపీలో ఉన్నారు కానీ.. రాజ్యంగ పదవిలో లేను అనే అసంతృప్తి ఆయనకు పెరిగిపోయింది.

చంద్రబాబు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని ఆశ చూపించి ఇవ్వడం లేదు. తాజాగా జిల్లాలో కొత్త పల్లి పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. టీడీపీలో వచ్చే ఎన్నికల్లో కొత్తపల్లికి సీటు ఇచ్చే అవకాశం లేదని చంద్రబాబు నేరుగా చెప్పేశాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ వైసిఫిళో ఆయనకు పదవి వస్తుందనే ఆశతో ఉన్నారని తెలుస్తోంది. ప్రధానంగా నరసాపురం ఎంపీ సీటు పై ఆయన దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. మరి వార్తలు వచ్చినట్లు వైసీపీలోకి ఆయన రీ ఎంట్రీ ఇస్తే.. జగన్ నరసాపురం ఎంపీ సీటు ఇస్తారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -