Saturday, May 18, 2024
- Advertisement -

తుస్సు మ‌న్న నారా హ‌మారా- టీడీపీ హ‌మారా కార్య‌క్ర‌మం..

- Advertisement -

చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ జిమ్మిక్కులు చేయ‌డం మొద‌లు పెట్టారు. ముస్లిం ఓట్ల కోసం నానా తంటాలు ప‌డుతున్నారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా భాజాపాతో అంట‌కాగి…మ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత మైనారిటీల‌పై ప్రేమ చూపిస్తున్నారు. గుంటూరులో నారా హ‌మారా-టిడిపి హ‌మారా కార్య‌క్ర‌మాన్ని భారీగా నిర్వ‌హించారు.

మైనారిటీల కోట్ల కోసం ఏర్పాటు చేసిన నారా హ‌మారా-టిడిపి హ‌మారా ప్రోగ్రామ్ తుస్సుమంది. స‌భ‌లో బాబు ఎంత గొంతు చించుకున్నా ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. బాబు మాట‌ల‌ను స‌మావేశంలో పాల్గొన్న సాధార‌ణ ముస్లింల నుండి పెద్ద‌గా స్పంద‌న క‌న‌బ‌డ‌లేదు. నిజం చెప్పాలంటే నారా హ‌మారా స‌ద‌స్సు విఫ‌ల స‌ద‌స్స‌నే చెప్పాలి.

గ‌త నాలుగు సంవ‌త్సరాలుగా మైనారిటీల‌ను ప‌ట్టించుకోని బాబు తీరా ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌పడుతున్న కొద్దీ వారిపై వ‌రాల జ‌ల్లులు కురింపించారు. అప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌న్న తోఫా అనే ఒకటి రెండు ప‌థ‌కాలు మాత్ర‌మే ఉండేవి. కాని ఇప్పుడు మాత్రం వారికోసం మ‌రో కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. మైనారిటీల‌కోసం తానెంత‌గా క‌ష్ట‌ప‌డుతున్న‌ది డ‌ప్పా కొట్ట‌కోవ‌డం త‌ప్ప చేసింది ఏమీలేదు.

ఓట్ల కోసం బాబు మాట‌లు కోట‌లు దాటుతాయి…కానీ చేత‌లు మాత్రం గ‌డ‌ప దాట‌వు. ఎన్డీఏ ఓడిపోవాలంటే రాష్ట్రంలో వైసిపి, జ‌న‌సేన ఓడిపోవాల‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముస్లింలంద‌రూ టిడిపికే ఓట్లు వేస్తామ‌ని గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు కొట్ట‌మ‌ని చంద్ర‌బాబు చెప్పిన‌పుడు పెద్ద‌గా స్పందించ‌లేదు.మొద‌టి నుండి ముస్లింల సంక్షేమానికి టిడిపినే క‌ట్టుబ‌డుంద‌ని గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు కొట్ట‌మ‌న్న‌పుడు కూడా ఎవ‌రూ పెద్ద‌గా స్పందించ‌లేదు. మొత్తంగా కార్య‌క్ర‌మం చూసుకుంటే భారీగా ప్ర‌చారం త‌ప్ప ఒరిగిందేమి లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం ప‌డుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -