Saturday, May 18, 2024
- Advertisement -

ప్రత్యర్ధులతో తలపడటానికి ఇప్పటికిప్పుడు సిద్ద‌మ‌న్న భానుమ‌తి….

- Advertisement -

అనంత‌పురం రాజ‌కీయాలు అంటే గుర్తుకొచ్చేది ఫ్యాక్స‌న్ రాజ‌కీయం. పరిటాల-మద్దెలచెర్వు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు ఏ స్ధాయిలో నడిచాయో కొత్తగా చెప్పక్కర్లేదు. తాజాగా జ‌గ‌న్ రాప్తాడులో జ‌రిగిన పాద‌యాత్ర ద్వారా రాజ‌కీయ స‌మీక‌ర‌నాలలో మార్పు వ‌చ్చింది. వైసీపీకీ వ‌స్తున్న ప్ర‌జాస్పంద‌న అద్భుతంగా ఉండ‌టంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి టీడీపీకి గ‌ట్టిపోటీ ఎదుర‌వుతుంది.

పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌ను సూరి భార్య భానుమ‌తి క‌లిశారు. ప్ర‌త్య‌ర్థుల‌ను ఢీకొట్ట‌డానికి రెడీ అంటున్నారు. జ‌గ‌న్ ఆదేశిస్తే అనంత‌పురంలోని ఏనియోజ‌క వ‌ర్గంనుంచైనా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. భానుమతి 2004 ఎన్నికల్లో పరిటాల రవితో పెనుకొండలో పోటీ చేసి ఓడిపోయారు. ఫ్యాక్షన్ కారణంగా ఇరువైపుల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో లెక్కేలేదు. చివరకు అదే ఫ్యాక్షన్ కు పరిటాల రవితో పటు మద్దెలచెరువు సూరి కూడా బలైపోయారు.

గ‌త కొన్నాల్లుగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న భానుమ‌తి ఇప్పుడు మ‌రో సారి క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఫ్యాక్షనిజం వల్ల జరిగే నష్టం తనకు తెలుసు కాబట్టే దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే, చంద్రబాబునాయుడు ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ ప్రోత్సహిస్తున్నట్లు మండిపడ్డారు. అదే సమయంలో పరిటాల రవి భార్య, మంత్రి పరిటాల సునీత కూడా స్పందించారు. జగన్ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు చేయటం గమనార్హం. జిల్లాలోని ప్రశాంత వాతావరణాన్ని జగన్ భగ్నం చేస్తున్నారట. తమ కుటుంబం ఎప్పుడూ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించలేదని చెప్పటం విచిత్రంగా ఉంది.

మొత్తం మీద భానుమతి మళ్ళీ రాజకీయాల్లో క్రియాశీలం కావటం ఓ విధంగా వైసిపికి ప్లస్సనే చెప్పాలి. ఎందుకంటే, పెనుకొండ నియోజవకర్గంలో పరిటాల వర్గాన్ని దీటుగా ఎదుర్కోగలిగే సత్తా ఒక్క భానుమతి వర్గానికి మాత్రమే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నిక‌ల్లో రెండు పార్టీల‌మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ జ‌ర‌గ‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -