67 మంది అభ్యర్థులు ఎలిమినేట్..!

వరంగల్​-నల్గొండ-ఖమ్మం స్థానంలో ఇప్పటివరకు 67 మంది అభ్యర్థులు ఎలిమినేట్​ అయ్యారు. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు బదిలీ అయ్యాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డికి 6,546 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 8,568 ఓట్లు, కోదండరాం ‌కు 9,038 ఓట్లు జమ అయ్యాయి.

ప్రస్తుతం టి.ఆర్.ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి 25,528‬ ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,17,386 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 91,858 ఓట్లు, కోదండరాం కు 79,110 ఓట్లు, ప్రేమేందర్‌రెడ్డికి 42,015 ఓట్లు వచ్చాయి. విజయం సాధించాలంటే 1,83,167 ఓట్లు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మహబూబ్‌నగర్, రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 87మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణి దేవి 10,035 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.

పాక్ జలసంధిని ఈది రికార్డు నెలకొల్పిన తెలుగు మహిళ!

‘చావు కబురు చల్లగా’ సినిమా రివ్యూ!

ముఖానికి నిమ్మరసం మంచిదేనా