Sunday, May 12, 2024
- Advertisement -

కోరలు చాస్తోంది కొవిడ్‌.. ఈరోజు భారీ కేసులు నమోదు..!

- Advertisement -

తెలంగాణ లో కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. తాజాగా 364 మందికి వైరస్ సోకింది. జీహెచ్​ఎంసీ పరిధిలో 75 మంది మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 3,02,724కి పెరిగింది.

వైరస్‌కు మరో ఇద్దరు బలయ్యారు. ఇప్పటివరకు మహమ్మారితో 1,666 మంది మరణించారు. తాజాగా 189 మంది బాధితులు డిశ్చార్జ్​ అయ్యారు. ఇప్పటివరకు 2,98,451 మంది కొవిడ్​ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,607 యాక్టివ్‌ కేసులున్నాయి.

ప్రస్తుతం 980 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.

తెలంగాణలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. బాధితుల్లో 90 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు లేకపోవడం గమనార్హం. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో దాదాపు 40 శాతం మంది విద్యార్థులే ఉన్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలాఖరు నాటికి కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నాయి.

పాక్ జలసంధిని ఈది రికార్డు నెలకొల్పిన తెలుగు మహిళ!

విద్యార్థులపై కరోనా పంజా..!

మజ్జిగతో బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -