Friday, March 29, 2024
- Advertisement -

పాక్ జలసంధిని ఈది రికార్డు నెలకొల్పిన తెలుగు మహిళ!

- Advertisement -

భారత్, శ్రీలంకల మధ్యనున్న పాక్‌ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించారు.  తమిళనాడు, శ్రీలంకలోని జాఫ్నా జిల్లాలను పాక్ జలసంధి కలుపుతుంది. నిన్న ఉదయం 4.15 గంటలకు శ్రీలంక తీరంలో తన సాహసకృత్యాన్ని ప్రారంభించిన శ్యామల ఏకబిగిన 13.43 గంటల్లోనే ఈది రామేశ్వరంలోని ధనుష్కోడి చేరుకున్నారు. ఆయనే శ్యామలకు ఈతలో మెళకువలు నేర్పి, మెరుగైన శిక్షణ ఇప్పించారు.

కాగా, పాక్‌ జలసంధిని ఈదిన ప్రపంచంలోనే రెండో మహిళ శ్యామల కావడం విశేషం. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన శ్యామలది మధ్యతరగతి రైతుకుటుంబం. తండ్రి కంటె వెంకటరాజు ఒకప్పుడు వెయిట్‌ లిఫ్టర్‌. శ్యామల బహుముఖ ప్రజ్ఞాశాలి. యానిమేషన్ చిత్రాల నిర్మాతగా, డైరెక్టర్‌గా, రచయితగా పలు పాత్రలు పోషిస్తున్నారు.  గతేడాది నవంబరులో గంగానదిలో 30 కిలోమీటర్ల దూరాన్ని 110 నిమిషాల్లోనే ఈది ఆరో స్థానంలో నిలిచారు.

ఇక 2012లో పాక్ జలసంధిని 12.30 గంటల్లోనే ఈదిన సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది వద్ద శ్యామల శిక్షణ పొందుతున్నారు. శ్యామల తన విజయాన్ని మహిళల విజయంగా అభివర్ణించారు.

‘చావు కబురు చల్లగా’ సినిమా రివ్యూ!

విద్యార్థులపై కరోనా పంజా..!

కిడ్నీలల్లో రాళ్లా.. అయితే ఇవి అస్సలు తినకండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -